మహా వృక్షాలు నరికేశారు....
ప్రభుత్వ కార్యాలయాల్లో పచ్చని చెట్లు తొలగించారు...
గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు...
మండపేట : వృక్ష సంపద ను కాపాడాల్సిన అధికారులే మహా వృక్షాలు అడ్డంగా నరికేశారు. చట్టాలను అమలు చేసేవారే చట్టాలను తుంగలోకి తొక్కి నిర్దక్షణ్యం గా పచ్చని నీడ ఇచ్చే 18 చెట్లు క్రూరంగా తొలగించారు. దీనిపై పర్యావరణ ప్రేమికులు గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం.
వివరాల్లో కి వెళితే మండపేట ఏడు, ఎనిమిది వార్డు ల పరిధిలో దళిత పేట లో ఎంపీడీఓ, అర్బన్ హెల్త్ సెంటర్ లు ఉన్నాయి. ఈ కార్యాలయాలు ఏర్పడి 40 ఏళ్లు పై మాటే. అప్పటి నుండి ఉన్న వేప, టేకు చెట్లు పెరిగి మహా వృక్షాలు గా ఉన్నాయి. ఇక్కడికి వచ్చే వారికి నీడ ను ఇస్తున్నాయి. కాగా మంగళవారం ఈ చెట్లను ఎలాటి అనుమతులు లేకుండా నరికేశారు. స్థానికులు ఫిర్యాదు మేరకు మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లి ఎంపీడీఓ కే సత్యనారాయణ ను వివరణ అడిగారు. ఎంపీడీఓ కార్యాలయం పై కొత్తగా సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నామని వాటికి ఈ కొమ్మలు అడ్డుగా ఉంటాయనే ఉద్దేశ్యం తో తొలగిస్తున్నట్లు వివరణ ఇచ్చారు. అటవీ, ఇతర శాఖల అనుమతులు తీసుకున్నారా అని ప్రశ్నిస్తే ఎలాటి అనుమతులు తీసుకోలేదని చెప్పారు.
నిబంధనలు మేర వ్యవహరించాల్సిన అధికారులే ఇలా అడ్డగోలు గా వ్యవహరించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేసి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునేలా చేస్తామని పర్యావరణ పరిరక్షణ సబ్యులు చెప్పారు. దీనిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ మందపల్లి రవికుమార్ పేర్కొన్నారు.
.jpeg)