మహిళలకు గుడ్ న్యూస్.. రెండు కొత్త పథకాలు
AP: మహిళా దినోత్సవం(మార్చి 8) రోజున డ్వాక్రా మహిళా సంఘాల సభ్యుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కళ్యాణలక్ష్మి పథకాలను ప్రారంభించనుంది. 'కళ్యాణ లక్ష్మి' కింద పిల్లల వివాహాలకు ₹10వేల నుంచి *లక్ష వరకు రుణం ఇస్తుంది. 48 వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. 'విద్యాలక్ష్మి'లో పిల్లల చదువుల కోసం ₹10,000-₹లక్ష రుణసాయం అందిస్తుంది. కనీసం 6 నెలలపాటు సభ్యత్వం ఉన్న వారికి ఇది వర్తిస్తుంది.
