
మండపేట సర్దార్ వేగుళ్ళ వీర్రాజు మున్సిపల్ మార్కెట్, రోడ్ మార్జిన్ వేలం పాట మంగళవారం మండపేట మున్సిపల్ కార్యాలయంలోని కమీషనర్ ఛాంబర్ లో నిర్వహించారు. గత ఏడాది రూ 26.50 లక్షలకు మార్కెట్ ఫీజు ఆదాయం వచ్చింది. 2026-27 ఏడాది వేలంపాట లలో సర్దార్ వేగుళ్ళ వీర్రాజు మున్సిపల్ మార్కెట్ కూరగాయల సంఘం అధ్యక్షులు టిడిపి నాయకులు చింతలపూడి సత్యనారాయణ రూ 26.90 లక్షలకు పాట దక్కించుకున్నారు. కాగా ఈ వేలం లో శేషపల్లి రాజు, బొడ్డు వెంకటలక్ష్మి తరుపున బొడ్డు రామకృష్ణ లు పాల్గొన్నారు. హెచ్చు పాట పాడిన చింతలపూడి సత్యనారాయణ మార్కెట్ ను దక్కించుకున్నారు. అనంతరం మునిసిపల్ మేకల కబేళా లో ఫీజులు వసూలు చేసుకునేందుకు పాట నిర్వహించారు. గత ఏడాది కో ఆప్షన్ సభ్యులు ఎండీ అత్తాపూర్ రహమాన్ అల్తాఫ్ రూ 1.12 లక్షలు కు దక్కించుకున్నారు. ఈ ఏడాది పాటల్లో బొడ్డు వెంకటలక్ష్మి తరుపున బొడ్డు రామకృష్ణ ,షేక్ మదీనా పలివెల జానకి రామ్, ఎండి అతవుర్ రెహమాన్ అల్తాఫ్ లు పాటల్లో పాల్గొన్నారు. ఈ వేలంలో షేక్ మదీనా రూ 1.66లక్షలకు కబేళా ఫీజు వసూళ్ల హక్కులను సొంతం చేసుకున్నారు. మండపేట బస్టాండ్ వద్ద మరుగుదొడ్లు ఫీజు వసూలు కోసం నిర్వహించిన పాటలో రూ 1.95 లక్షలకు మీసాల గౌరీ వేలంపాటలో హక్కులను దక్కించుకున్నారు. కమిషనర్ టీవీ రంగారావు నేతృత్వంలో మున్సిపల్ ఆర్ ఓ మాచిరాజు రవి, మున్సిపల్ ఆర్ ఐ కొత్తపల్లి సత్తిబాబులు ఈ పాటలను నిర్వహించారు. మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ కార్యాలయం ఏ 1స్వర్ణ నాగలక్ష్మి, ఔట్సోర్సింగ్ సిబ్బంది హాజరయ్యారు. వేలంపాట నిర్వహణ మొత్తం వీడియో రికార్డింగ్ చేశారు.