మండపేట పురపాలక సంఘం పరిధిలో మునిసిపల్ వీధిలైట్లు వెలుతురు రాకుండానే ఆర్పేస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకులు కోన సత్యనారాయణ ఆరోపించారు . దీంతో సైకిలిస్టులకు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వాపోయారు. సామాన్యలు,రైతులు,పారిశుద్యకార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చలి కాలం కావడం తో సూర్యోదయం 6.30 సమయం లో ఉంటుందని అప్పటి వరకు చీకటి ఉంటుందన్నారు. వెలుతురు వచ్చేవరకైనా వీధిదీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.చాలచోట్ల పట్టపగలే వీధిలైట్లు వెలుగుతూ విద్యుత్తు వృదా అవుతున్నాయన్నారు. ప్రభుత్వంపై ఆర్ధిక భారం పడుతున్నా పర్యవేక్షణ లోపంతో పట్టించుకోని ఉద్యోగులు, అధికారులు సామాన్యులకు,రైతులకు అసౌకర్యం లేకుండా సమస్య పరిష్కరించి వెలుతురు ఉండేలా చూడాలని కోరారు.
