
వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి అయి వ్యతిరేక పాలనను అంతం చేసేందుకే 'సంకల్ప పాదయాత్ర' మరోసారి వై.యస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి.. మరోసారి కొత్తపేట మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి భారీ మెజారిటీతో ఎమ్మెల్యే కావాలి.వైఫల్యాల ఊబిలో కూటమి ప్రభుత్వం.. మళ్ళీ జగనన్న పాలన రావాలి :కొడమంచిలి హరీష్ కుమార్ రాష్ట్ర మేధావుల ఫోరమ్ కార్యదర్శి ఆలమూరు:రాష్ట్రంలో గత ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన రంగురంగుల హామీలు నేడు నీటి మూటలుగా మిగిలాయని, అరాచక పాలనతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగి జగనన్న సుపరిపాలన మళ్ళీ రావాలని కోరుకుంటూ రాష్ట్ర మేధావుల వర్గం కార్యదర్శి కొడమంచిలి హరీష్ కుమార్ భారీ సంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.రాష్ట్రంలో సుపరిపాలన అందాలంటే వైయస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, కొత్తపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి భారీ మెజారిటీతో మరోసారి ఎమ్మెల్యే కావాలి అని అందుకోసం దైవ ఆశీస్సుల కోసం 'సంకల్ప పాదయాత్ర' చేపడుతున్నట్లు రాష్ట్ర మేధావుల వర్గం కార్యదర్శి కొడమంచిలి హరీష్ కుమార్ ప్రకటించారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అరాచకాలను అంతం చేసి, దేవుడి దయతో ప్రజలందరికీ మేలు చేసే వైసిపి ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా హరీష్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా, ఎన్నికల మేనిఫెస్టోలోని 'సూపర్ సిక్స్' హామీల ఊసే లేదని విమర్శించారు.మహిళలకు ఆర్థిక భరోసా: నెలకు ₹1500 ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.యువతకు నిరుద్యోగ భృతి: 20 లక్షల ఉద్యోగాల ఊసే లేదు, నిరుద్యోగ భృతి అమలులో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు.అన్నదాత సుఖీభవ కింద రైతులకు అందాల్సిన పెట్టుబడి సాయం అందక రైతులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు యోచన, బడ్జెట్ కేటాయింపుల్లో అస్పష్టత మరియు అభివృద్ధి కుంటుపడటం వంటివి కూటమి ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు.రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పథంలో పయనాలంటే వై.యస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఒక్కటే మార్గమని, అందుకు భగవంతుడి ఆశీస్సులు కోరుతూ ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు.ఈ నెల 20న రావులపాలెం నుండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జగ్గిరెడ్డి ఆశీస్సులతో యాత్ర మొదలయ్యి విజయవాడలోని గుణదల మేరీ మాత కొండ వరకు ఈ యాత్ర కొనసాగుతుంది అని హరీష్ తెలిపారు.ఈ యాత్ర ద్వారా ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, రాబోయే రోజుల్లో జగనన్న ఎంపిక చేసే అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిచి, ప్రజలకు అండగా నిలవాలని హరీష్ కుమార్ ఈ సంకల్పం తీసుకున్నారు. ఈ యాత్రలో వైసీపీ నాయకులు,కార్య కర్తలు,అభిమానులు ప్రజాస్వామ్యవాదులు, మేధావులు మరియు వైసిపి క్యాడర్ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.