విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణం పనులు దగ్గర ఉండి పరిశీలిస్తున్న ఆలమూరు ఎంపీడీఓ రాజు
డా బిఆర్ అంబేత్కర్ కొనసీమ జిల్లా,కొత్తపేట నియోజక వర్గం ఆలమూరు మండలం, పినపళ్ళ గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణ పనులు జరుగుతుండగా ఈ పనుల పురోగతిని ఆలమూరు మండల పంచాయతీరాజ్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) రాజు స్వయంగా పరిశీలించారు.పినపళ్ళతో పాటు ఆలమూరు మండలంలోని ఆయా గ్రామాల్లో కూడా విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం జరుగుతుండగా ఈ క్లినిక్‌ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అని అన్నారు. ఎంపీడీఓ రాజు పనులు త్వరగా పూర్తి చేసి, ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు.ఈ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు గ్రామస్థులకు సౌకర్యవంతమైన వైద్య సేవలు అందించడంతో పాటు, ఈ కార్యక్రమం ద్వారా మారుమూల ప్రాంతాల్లో డాక్టర్ల సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఉపయోగపడతాయి అని అన్నారు.
