వైసీపీ నాయకులపై వేధింపులు సరికాదనీ రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మన్, కక్ష సాధింపు తగదు.


 కక్ష సాధింపు తగదు....

ఎల్లవేళలా ఈ ప్రభుత్వం వుండదు....

ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆగ్రహం....

వైసీపీ నాయకులపై వేధింపులు సరికాదనీ రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మన్, మండపేట వైసిపి ఇన్ ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హెచ్చరించారు.

మండపేట నియోజకవర్గం చెల్లూరు శివారు వ్యవసాయం నిమిత్తం రైతు మట్టిని చదును చేసుకుంటున్నా వాహనాలు సీజ్ చేయడం దారుణమని చెప్పారు. చెల్లూరు లో పాలిక శ్రీను తన పొలాన్ని చదును చేసుకుంటే ట్రాక్టర్ లను తహసీల్దార్ సీజ్ చేయడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారులు టిడిపి చెప్పు చేతల్లో నడవడం సరికాదన్నారు.ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదనీ హెచ్చరించారు.

వైసీపీ ప్రభుత్వం హయంలో స్కూళ్లకు దగ్గరగా ఉన్న వైన్స్ను రిమూవ్ చేసి శివారులో ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఈ రైతు పొలంలో మట్టి ఫిల్లింగ్ చేశారన్నారు. ఇపుడు

ఈ మట్టిని వ్యవసాయ నిమిత్తం చదును చేస్తుంటే కక్ష ఏమిటని ప్రశ్నించారు. కేవలం వైసిపి నాయకుడని వాహనాల్ని  తహసీల్దార్ వీఆర్వోలు సీజ్ చేయాడన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

రాబోయే రోజుల్లో వైయస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మూల్యం చెల్లించుకోక తప్పదనీ హెచ్చరించారు. మండపేట నియోజవర్గంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు టిడిపి నాయకులు ఏ విధమైన ఆటంకాలు కలిగించిన వైఎస్ఆర్సిపి తరఫున తాము అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.