జనసేన ఇంచార్జ్ బండారు పరామర్శ (ఆలమూరు)
కొత్తపేట నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ మండలంలోని సంధిపూడిలో గురువారం పర్యటించారు. ఈసందర్భంగా కాలికి తగిలిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకుని ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటున్న నామాల యేసు రాజు (సాక్షి విలేకరి) ను పరామర్శించి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన కోలుకుని దైనందిన జీవితంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. జనసేన పార్టీ మండల అధ్యక్షులు సూరపురెడ్డి సత్య, చింతలూరు సొసైటీ చైర్మన్ నల్లా వెంకన్న, గ్రామ సర్పంచ్ తోట భవానీ వెంకటేశ్వర్లు, మోటుపల్లి రాంబాబు పాల్గొన్నారు.
