నేటి అంశం: సివిల్ సెటిల్‌మెంట్లలో పోలీసులు జోక్యం చేసుకుంటున్నారా? మిమ్మల్ని స్టేషన్‌కు పిలిచి బెదిరిస్తున్నారా?


  నేటి అంశం: సివిల్ సెటిల్‌మెంట్లలో పోలీసులు జోక్యం చేసుకుంటున్నారా? మిమ్మల్ని స్టేషన్‌కు పిలిచి బెదిరిస్తున్నారా?

భూమి గొడవలు, డబ్బు లావాదేవీలు లేదా ఆస్తి తగాదాలు (Civil Disputes) ఉన్నప్పుడు పోలీసులు అందులో తలదూర్చడానికి వీల్లేదు. కానీ చాలా సందర్భాల్లో పోలీసులు ఒక పక్షం నుండి డబ్బు తీసుకుని అవతలి వారిని స్టేషన్‌కు పిలిచి భయపెడుతుంటారు.

✅ వాస్తవాలు (The Facts):

* సుప్రీంకోర్టు తీర్పులు: సివిల్ గొడవల్లో పోలీసులు జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో (ఉదా: లలిత కుమారి కేసు) స్పష్టంగా చెప్పింది.

* పోలీస్ మాన్యువల్: సివిల్ వివాదాల పరిష్కారం పోలీసుల పరిధిలోకి రాదు. వాటిని కోర్టులు మాత్రమే తేల్చాలి.

✅ మీరు చేయాల్సినవి (The Solution):

1. ధైర్యంగా అడగండి: పోలీసులు ఫోన్ చేసి "ఫలానా భూమి గొడవలో స్టేషన్‌కు రా" అంటే, "సార్ అది సివిల్ మేటర్, కోర్టులో ఉంది. నేను రాను" అని చెప్పే హక్కు మీకు ఉంది.

2. హైకోర్టులో పిటిషన్: పోలీసులు మిమ్మల్ని పదే పదే పిలిచి వేధిస్తుంటే, మీ అడ్వకేట్ ద్వారా హైకోర్టులో "Writ of Mandamus" వేయవచ్చు. "సివిల్ గొడవలో పోలీసులు జోక్యం చేసుకోకుండా ఆదేశించండి" అని కోరవచ్చు. ఇలా చేస్తే ఆ పోలీస్ అధికారిపై కోర్టు సీరియస్ అవుతుంది.

3. పై అధికారులకు ఫిర్యాదు: మీ ప్రాంతపు DCP లేదా SP కి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయండి. "ఫలానా అధికారి సివిల్ విషయంలో జోక్యం చేసుకుని నన్ను బెదిరిస్తున్నారు" అని చెప్పండి.

4. వాయిస్ రికార్డింగ్: పోలీసులు సెటిల్‌మెంట్ కోసం మిమ్మల్ని బెదిరిస్తున్నప్పుడు లేదా డబ్బులు డిమాండ్ చేస్తున్నప్పుడు కచ్చితంగా రికార్డ్ చేయండి...

5. ఇవన్నీ సమయం సందర్భం వచ్చినప్పుడు మాత్రమే వాడాలి.....