కపీలేశ్వరపురం మండలం అంగర గ్రామానికి చెందిన పలువురు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ స్వగృహంలో ఈ చేరికలు జరిగాయి. నూతనంగా పార్టీలో చేరిన వారికి లీలాకృష్ణ జనసేన కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో సంకబత్తుల నాగేంద్ర, అడ్డాల శరణ్ కుమార్, చిలుకూరి అంజిబాబు, సంకబత్తుల అభిచంద్ర, గుర్రం ధనరాజు లు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కొత్త దిశగా సాగుతోందని పేర్కొన్నారు. అంకితభావంతో పనిచేసి మండపేట నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలపరచేందుకు కృషి చేస్తామని నూతన సభ్యులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తుట్టపు నాగరాజు, అంగర జనసేన నాయకులు పిల్లా బసవరాజు పాల్గొన్నారు.
