.
మండపేట ఆలమూరు రోడ్డు విజ్ఞాన స్కూల్ వద్ద పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు ముందుగా వెళుతున్న ఐరన్ లోడ్ ఊచల రాడ్లు వ్యానును వెనుక నుంచి ఢీ కొట్టింది. ఆర్టీసీ బస్సు అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. తృటిలో డ్రైవర్, ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. ఇంటి నిర్మాణం కోసం
ఐరన్ ఊచలు లోడుతో వెళ్తున్న వ్యాన్ ఐరన్ కి వెనుక వైపు ఎటువంటి హెచ్చరిక వస్త్రాలు కట్టలేదు. సాధారణం గా ఎర్ర జెండా ను కట్టి ఇలాంటి లోడ్ లు తీసుకొని వెళతారు. ఇక్కడ ఈ వ్యాన్ కి ఎలాంటి హెచ్చరిక జెండా లేకపోవడం తో వ్యాన్ పై ఉన్న ఐరన్ కనపడక వ్యాను బ్రేక్ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కాగా మండపేట రవాణా శాఖ అధికారులు నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఇలాంటి వాహనాలను కనీసం చెక్ చేయడం కూడా రవాణా అధికారులు వదిలేశారు. మండపేట లో
ఆటో వ్యాన్ రిక్షాల కు ఐరన్ ఊచలకు వెనకాల ఎటువంటి హెచ్చరికలు చేస్తూ ఎటువంటి జెండా లు ఏర్పాటు చేయడం లేదు. వాహనం అతి దగ్గర వచ్చేవరకు ఈ నల్లటి ఊచల కనపడవు. చాలామంది తృటిలో తప్పించుకుని వెళుతూ ఉంటారు. ప్రయాణికులు ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సురక్షితం గా ఈ ప్రమాదం నుండి బయటపడ్డారు.
