అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్ట్ గండ్రోతు సతీష్ కు ఇటీవల నూతనంగా ఏర్పడిన కొత్తపేట ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ సభ్యులు ఆర్థిక చేయూత అందించారు సభ్యులందరి సహాయ సహకారాలతో బుధవారం రావులపాలెం మండలం ఈతకోటలో సతీష్ ను పరామర్శించి రూ.27,000 అందజేసారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
సి.ఆర్.సి రూ.25 వేలు ఆర్థిక సాయంఅలాగే అసోసియేషన్ సభ్యుల విజ్ఞప్తి మేరకు రావులపాలెం సి.ఆర్.సి రూ.25,000 అందజేసింది. సి.ఆర్.సి పాలకవర్గ సూచన మేరకు మేనేజర్ వీరభద్రరావు అసోసియేషన్ సభ్యుల సమక్షంలో ఈ మొత్తాన్ని సతీష్ కు అందజేశారు. ఈ సందర్భంగా సతీష్ కుటుంబ సభ్యులు, అసోసియేషన్ సభ్యులు సి.ఆర్.సి కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
.jpeg)