ఓర్వలేక వైసిపి విమర్శలు...



పెద్ద ఎత్తున టీడీపీ లో చేరటం చూసి వీరబాబు కు కళ్ళు సరిగా కనిపించటం లేదు...

కంటి పరీక్షలు చేయించుకుంటే బాగుంటుంది...

టీడీపీ నాయకుడు చిన్ని గంగాధరరావు...

మండపేట ప్లాష్ న్యూస్:

ఇప్పడపాడు నుండి పెద్ద ఎత్తున తన అనుచరులతో కలసి టీడీపీలో చేరితే జిల్లా వైసీపీ పార్టీ ఉపాధ్యక్షులు పిల్లా వీరబాబు బూటకపు చేరికలు అంటున్నారని, బహుశా వారికి కళ్ళు సరిగా కనిపించటంలేదోమోనని నూతనంగా టిడిపి లో చేరిన  చిన్ని గంగాధరరావు ఎద్దేవా చేశారు. మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలన నచ్చి సుమారు 100 మందితో వైసీపీ నుండి టీడీపీ లో చేరితే అది జీర్ణించుకోలేని వైసిపి నాయకులు  పిల్లా వీరబాబు బూటకపు చేరికలని అనటం విడ్డూరంగా ఉందన్నారు. వీరబాబు కు కళ్ళు సరిగా కనిపించటం లేదని విమర్శించారు.  ఎంతమంది ఉన్నా నలుగురు గా  కనిపిస్తున్నారని దుయ్యబట్టారు. కంటి పరీక్షలు చేయించుకోవాలని హితవు పలికారు. వీరబాబు ఇప్పనపాడు వస్తే తనతో పాటు ఎంతమంది చేరారో చూపించటానికి తాను సిద్దంగా ఉన్నానని సవాల్ విసిరారు. అప్పుడైన అతనికి కనువిప్పు కలుగుతుందన్నారు.  బురదజల్లాలని చేసే ప్రయత్నాలు మానుకుంటే బాగుటుందని గంగాధరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు యిర్రోతు సత్యనారాయణ, తాటికొండ సత్యనారాయణ, బొండా దుర్గాప్రసాద్, వడ్డి జగ్గారావు, యిర్రోతు సూర్య సత్య నారాయణ లు ఉన్నారు