మండపేట జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రత పరిరక్షణే లక్ష్యం గా తూర్పు గోదావరి జిల్లా పోలీస్ పనిచేస్తుందని జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ పేర్కొన్నారు. మండపేట నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లాలో విలీనం అయిన తర్వాత తొలి సారిగా ఎస్పీ నరసింహ కిషోర్ ఇక్కడికి విచ్చేశారు. తొలుత మండపేట మండలం లోని ఇప్పనపాడు పోలీస్ స్టేషన్ ను ఆయన సందర్శించారు. అక్కడి నుండి మండపేట టౌన్ పోలీస్ స్టేషన్ కు విచ్చేశారు. టౌన్, రూరల్ సి ఐ లు సురేష్, దొరరాజు లు ఆయనకు స్వాగతం పలికారు. ఎస్పీ నరసింహ కిషోర్ వెంట రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డీఎస్పీ బి విద్య ఉన్నారు. ఈ సందర్భంగా మీడియా తో ఎస్పీ నరసింహ కిషోర్ మాట్లాడుతూ జిల్లా లో గతంలో నేరస్తులు వలస వచ్చి ఇక్కడ నేరాలకు, చోరీలకు పాల్పడేవారన్నారు. దీనిపై గట్టి నిఘా ఉంచామన్నారు. చోరీలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా స్నేహపూరిత పోలీసింగ్ వ్యవస్థ ను పరిచయం చేస్తున్నామన్నారు. ప్రజలు స్వేచ్ఛగా పోలీస్ లు వద్ద కు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునేలా ఫ్రెండ్లీ పోలీస్ విధానం అమలు చేస్తున్నామని తెలిపారు. రాజమహేంద్రవరం డీఎస్పీ బి విద్య వారంలో మూడు రోజులు మండపేట సర్కిల్, మరో మూడు రోజులు అనపర్తి సర్కిల్ లో అందుబాటులో ఉంటారని చెప్పారు. పోలీస్ స్టేషన్ ను పరిశించారు. ఇక్కడ నుండి అంగర పోలీస్ స్టేషన్ కు వెళ్ళారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్ ఐ రాము పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
