ఈ ఆర్థిక సంవత్సరం లో వంద శాతం ఆస్తి పన్నులు వసూలు చేసి రికార్డు సృష్టించేందుకు మండపేట పురపాలక సంఘం కమిషనర్ టీవీ రంగారావు వినూత్న ప్రచారం చేపట్టారు.ప్రచార వాహనం ద్వారా పన్నులు చెల్లింపు కోసం మొబైల్ కౌంటర్ ఏర్పాటు చేశారు.మండపేట పురపాలక సంఘ కమీషనరు టి.వి.రంగారావు పట్టణ పరిధిలోని అన్ని వార్డులలో ప్రతిరోజు ఇళ్ళ వద్దనే (ఇంటి పన్నులు, ఖాళీ స్ధలం పన్నులు, కుళాయి పన్నులు, ట్రేడ్ లైసన్స్) లకు సంబంధించి పన్నులు చెల్లించేందుకు మొబైల్ కౌంటర్ ఏర్పాటు చేశారు. మునిసిపల్ ఆర్ ఓ మాచిరాజు రవి, ఆర్ ఐ కొత్తపల్లి సత్తిబాబు ల నేతృత్వంలో ఈ ప్రచారం జిప్ లో వార్డుల్లో ఇంటింటికి తిరిగి పన్నులు వసూలు చేస్తున్నారు. ఈ సందర్భంగా కమీషనర్ టీవీ రంగారావు మాట్లాడుతూ 2025-26 ఆర్దిక సంవత్సరానికి సంబంధించిన ఆస్థి పన్నులు వారి ఇంటి వద్దనే చెల్లించేందుకు వీలుగా ప్రచార వాహనం లో ప్రత్యేక మొబైల్ కౌంటర్ అందుబాటు లో ఉంటుందని పేర్కొన్నారు. మొబైల్ కౌంటర్ లో ఆస్తి పన్నులు చెల్లింపు అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.