వైసీపీ నాయకులు పరామర్శ....

 తలశిల రఘురాం కు


వై.యస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ తలశిల రఘురాం  తండ్రి తలశిల చంద్రశేఖరరావు ఇటీవల మృతి చెందారు .ఈ నేపధ్యంలో మాజీ మంత్రి  తానేటి వనిత,  చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ, రాజోలు అమలాపురం నియోజకవర్గం పరిశీలికులు  వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు,  మండపేట రూరల్ జడ్పిటిసి  కే భవాని రాంబాబు ,  వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పలివెల సుధాకర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాధనాల శివ భగవాన్,  కర్రి వెంకటరెడ్డి  తదితరులు  ఎమ్మెల్సీ తలశిల రఘురాం ను పరామర్శించారు.గొల్లపూడి లోని వారి నివాసానికి వెళ్లి  ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.