శాంతియుతంగా రంజాన్ నిర్వహించాలి నాలుగు మసీదు బాధ్యులు తో సి ఐ సురేష్ సమావేశం...

.


 మండపేట లోని నాలుగు మసీదుల్లో రంజాన్ మాసం ఉపవాసాలు శాంతియుత వాతావరం లో నిర్వహించుకోవాలని టౌన్ సి ఐ సురేష్ పేర్కొన్నారు. గురువారం నుండి పవిత్ర

రంజాన్ మాసం  ఆరంభం కానున్న నేపథ్యంలో పట్టణం లోని నాలుగు మసీదు బాధ్యులు తో ఆయన బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సి ఐ సురేష్ మాట్లాడుతూ  రాత్రి సమయం లో ప్రార్థనలకు వచ్చే వారు మోటర్ సైకిళ్ల పై ముగ్గురు వెళ్లకూడదన్నారు. ఆయా మసీదు ల వద్ద  వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. కలువ పువ్వు సెంటర్ జామియా మస్జిద్, విజయ లక్ష్మీ నగర్ అక్సా మస్జిద్ ల్లో సీసీ కెమెరాలు ఉన్నాయని మిగిలిన మసీదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జామియా మస్జిద్ అధ్యక్షులు ఎండి అతవుర్ రెహమాన్ అల్తాఫ్  మాట్లాడుతూ మండపేట లో  అన్ని మతాలు కలిసి అన్యోన్యంగా పండుగలు నిర్వహిస్తారని చెప్పారు. పోలీస్ శాఖ నియమాలను పాటిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సైదల్లి పేట లోని హజరత్ హంజా మస్జిద్ బాధ్యులు ఎస్ హుస్సేన్, గాంధీనగర్ అల్ అమీనా మస్జిద్ బాధ్యులు షేక్ గౌస్, విజయలక్ష్మి నగర్ లోని అక్సా మస్జిద్ బాధ్యులు షేక్ మౌలాలి, మండపేట టౌన్ టిడిపి మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ కరీం మెకానిక్ తదితరులు పాల్గొన్నారు.