పాపం అందుకనే నలుగురు చేరారని అంటున్నాడు...
కంటి పరీక్షలు చేయించుకుంటే బాగుంటుంది...
టీడీపీ నాయకుడు చిన్ని గంగాధరరావు....
ఇప్పడపాడు నుండి పెద్ద ఎత్తున తన అనుచరులతో కలసి టీడీపీలో చేరితే జిల్లా వైసీపీ పార్టీ ఉపాధ్యక్షులు పిల్లా వీరబాబు బూటకపు చేరికలు అంటున్నారని, బహుశా వారికి కళ్ళు సరిగా కనిపించటంలేదోమోనని చిన్ని గంగాధరరావు అన్నారు. మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలన నచ్చి సుమారు 100 మందితో వైసీపీ నుండి టీడీపీ లో చేరితే అది జీర్ణించుకోలేని వీరబాబు బూటకపు చేరికలని అనటం విడ్డూరంగా ఉందన్నారు. వీరబాబు కు కళ్ళు సరిగా కనిపించటం లేదని అందువలనే ఎంతమంది ఉన్నా నలుగురు గా కనిపిస్తున్నారని దుయ్యబట్టారు. కంటి పరీక్షలు చేయించుకోవాలని హితవు పలికారు. వీరబాబు ఇప్పనపాడు వస్తే తనతో పాటు ఎంతమంది చేరారో చూపించటానికి తాను సిద్దంగా ఉన్నానని, అప్పుడైన అతనికి కనువిప్పు కలుగుతుందన్నారు. అంతేకాని కావాలని బురదజల్లాలని చేసే ప్రయత్నాలు మానుకుంటే బాగుటుందని గంగాధరరావు అన్నారు. సంక్షేమం, అభివృద్ది గురించి మాట్లాడే అర్హత వీరబాబు కు లేదని, గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వ నాశనం చేశారో అందరికీ తెలుసునన్నారు. కూటమి ప్రభుతం వచ్చినప్పటి నుండి రాష్ట్రాన్ని అన్ని విధాలా గాడిలో పెట్టి సంక్షేమం, అభివృద్ది సమపాలనలో అందిస్తున్న ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందన్నారు. ఇకనైన మెప్పుకోసం చేసే ఇటువంటి చౌకబారు విమర్శలు వీరబాబు మానుకోవాలని గంగాధరం అన్నారు. ఈ కార్యక్రమంలో యిర్రోతు సత్యనారాయణ, తాటికొండ సత్యనారాయణ, బొండా దుర్గాప్రసాద్, వడ్డి జగ్గారావు, యిర్రోతు సూర్య సత్య నారాయణ లు ఉన్నారు.
