వ్యాధుల పట్ల అవగాహన అవసరం....




వ్యాధులు పట్ల  అవగాహన అవసరమని

వరద స్కానింగ్ అధినేత రేడియాలజిస్టు  డాక్టర్ శశిధర్  పేర్కొన్నారు.

పేద ప్రజలకు మేలైన వైద్యం అందించాలంటే  వ్యాధులపై  అవగాహన అవసరమని పేర్కొన్నారు .బుధవారం మండపేటలో  స్కానింగ్ సెంటర్  ఆవరణలో  కమ్యూనిటీ పారామెడిక్స్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు కోన సత్యనారాయణ అద్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. మండపేట, రూరల్, కపిలేశ్వరపురం, రాయవరం, ఆలమూరు మండలాల సభ్యులతో  జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర ఉపాద్యక్షులు గంగుమళ్ల రాంబాబు అవయవదానం గురించి వివరించారు. పల్లెల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అవయవ దానాన్ని ప్రోత్సహించాలన్నారు. డాక్టర్లకు అసోసియేషన్ ఆద్వర్యంలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పి ఎం పి  గౌరవ అద్యక్షులు బళ్ల వెంకట రమణ,  పీఎంపీ మండల ప్రదానకార్యదర్శి ఇరవాడ రవికుమార్, 

పీఎంపీ కోశటధికారి వానపల్లి కనకరాజు వివిధ మండలాల పీఎంపీ అసోసియేషన్ అద్యక్ష,కార్యదర్శులు 150మంది సభ్యులు పాల్గొన్నారు.