నిందితురాలిని పట్టుకున్న తిరుమల వన్‌టౌన్ పోలీసులు.
తల్లిదండ్రులకు చిన్నారులు అప్పజెప్పిన పోలీసులు.
నిందితురాలు గుండ్లూరు శివమ్మ. Ap తిరుమల: సులభంగా డబ్బు సంపాదించేందుకు ఇద్దరు చిన్నారులను దొంగిలించిన నిందితురాలిని తిరుమల వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు బాలికలను తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.ఎస్‌ఐలు చలపతి, రమేష్‌బాబుపశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన లక్ష్మి, రాంబాబు దంపతులు తమ కుమార్తెలు నవదుర్గ(5), అశ్విని(3)లతో తిరుమల వచ్చారు ఈ నెల 16న ఉదయం స్థానిక నాదనీరాజనం ప్రాంతంలో బాలికలు ఆడుకుంటుండగా అన్నమయ్య జిల్లా కలకడ మండలానికి చెందిన గుండ్లూరు శివమ్మ వారిని దొంగిలించి,వెతుకెళ్లి తన వెంట తీసుకుపోయింది బాలికల తల్లి తిరుమల వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు.
సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించి ప్రత్యక్ష సాక్షుల నుంచి సమాచారం సేకరించారు ప్రత్యేక పోలీసు బృందాలతో నిందితురాలిని ఈ నెల 17న కొవ్వూరు రైల్వేస్టేషన్‌లో అదుపులోకి తీసుకుని ఇద్దరు చిన్నారులను రక్షించారు.బాలికలకు రాజమహేంద్రవరం బాలల సంరక్షణ గృహానికి అప్పగించి,నిందితురాలిని హోంకు తరలించారు. సులభంగా నగదు సంపాదించాలనే ఉద్దేశంతో తిరుమలలో ఒంటరిగా ఉన్న చిన్నారులను ఎత్తుకెళ్తుంది. వారితో భిక్షాటన చేయించేందుకు ప్రణాళిక రచించినట్లు నిందితురాలు నేరాన్ని అంగీకరించింది తిరుపతిలోని సీడబ్ల్యూసీ ద్వారా బాలికలను తల్లిదండ్రులకు అప్పగించారు.
