కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ యథావిధి....
కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ యథావిధి....
జిల్లా,డివిజన్ మండల స్థాయిలో రెవెన్యూ క్లినిక్ నిర్వహణ....
కలెక్టర్ కీర్తి చేకూరి ..
రాజమహేంద్రవరం ప్లాష్ న్యూస్: సోమవారం ఫిబ్రవరి 16వ తేదీన జిల్లా కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఇదే విధంగా జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో కూడా పీజీఆర్‌ఎస్ కార్యక్రమాలు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు.
అదే సమయంలో జిల్లా, డివిజన్, మండల పరిధిలో రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజలు 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి తమ అర్జీలను నమోదు చేయవచ్చని తెలిపారు. గతంలో అందజేసిన అర్జీల పరిష్కార స్థితిని కూడా తెలుసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు.
