తల్లి ప్రేమకు ఎల్లలు లేవు, మతాలు అడ్డు కాదు



 తల్లి ప్రేమకు ఎల్లలు లేవు, మతాలు అడ్డు కాదు

తాను పసిపిల్లవాడుగా ఉన్న సమయంలో పెంచిన హిందూ తల్లి ని వెతుక్కొంటూ వచ్చిన సౌదీ అరేబియాకు చెందిన అరబ్బు యువకుడు. కేరళకు ప్రత్యేక విమానంలో వచ్చి తన చిన్నప్పటి జ్ఞాపకాలను, ప్రేమతో పెంచిన తల్లితో కలిసి  పంచుకున్నారు .! 

సౌదీలో పొట్టకూటి కోసం వెళ్ళి తాను పెంచిన ఆ బాలుడు ఇప్పుడు పెద్ద యువకుడై తన వద్దకు రావడంతో  సొంత కొడుకును హత్తుకొన్నట్టు హత్తుకుని మురిసిపోయింది ఆ తల్లి.

సొంత తల్లి కన్నా తనకు అనుబంధం పెంచిన తల్లితోనే అని, ఆమె చాలా గొప్పదని ఆ యువకుడు చెప్పడం గమనార్హం.

వృద్ధురాలయిన ఆమె సౌదీ లో ఒక షేక్ ఇంటిలో ఎక్కువ కాలం పని చేసి చాలా కాలం క్రితం సొంత ఊరు ఇండియా కేరళకు తిరిగి వచ్చింది.

ఆమె శేష జీవితానికి భరోసా కలిగించే విధంగా ఆ యువకుడు తగు చర్యలు చేపట్టి మళ్ళీ వస్తానమ్మా అని చెప్పి సౌదీకి ఆ యువకుడు తిరిగి వెళ్ళాడు.😊