రైతుల మేలుకోసం మార్కెట్ కమిటీలు కృషి చేయాలి...


సమర్థవంతమైన నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లుగా బాధ్యతలు స్వీకరించడం సంతోషకరం...అన్నదాతల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుంది...కొత్తపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, సభ్యుల ప్రమాణస్వీకారంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు...వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, సభ్యులు రైతులకు అందుబాటులో ఉంటూ, వారికి అన్ని విధాలా మేలు చేయడానికి కృషి చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు.ముందుగా రావులపాలెం పార్టీ కార్యాలయం నుండి కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మరియు జనసేన ఇంచార్జి బండారు శ్రీనివాస్ రావులపాలెం సెంటర్ లో ఉన్న కళా వెంకట్రావు విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ గా ఎం కె ఆర్ ఫంక్షన్ కి చేరుకున్నారు.అనంతరం ఎం కె ఆర్ ఫంక్షన్ హాల్ నందు జరిగిన కొత్తపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, సభ్యుల ప్రమాణస్వీకార మహోత్సవంలో అయన ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్,శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం,రాష్ట్ర బీసీ కోఆపరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి,అనపర్తి తెలుగుదేశం నియోజకవర్గ పరిశీలకులు ఆకుల రామకృష్ణ, గ్రంధాలయ చైర్మన్ సాయిబాబు,రాజోలు ఇంచార్జి గొల్లపల్లి అమూల్య, డీసీఎంస్ చైర్మన్ పిచ్చేట్టి చంద్రమౌళి, రామచంద్రపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ రిషి,కె వి సత్యనారాయణ రెడ్డి, పాలూరి సత్యానందం తదితరులతో కలిసి పాల్గొన్నారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల సారధ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో, రాష్ట్రంలో ప్రజా రంజకమైన పాలన అందిస్తుందన్నారు. ప్రజలు ఏ నమ్మకంతో అయితే కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందన్నారు. సమర్థవంతమైన నాయకులకు, పనిచేసే నాయకులకు, ప్రజల్లో ఉండే నాయకులకు ఎన్డీఏ కూటమి తరపున కొత్తపేట మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులుగా అవకాశం ఇవ్వడం శుభపరిణామమన్నారు. కొత్తపేట నియోజకవర్గంలోనే మూడవ అతిపెద్ద గ్రామమైన వానపల్లికి నేడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన పల్లి మంగాదేవి సర్పంచ్ గా ఒకసారి, ఆమె భర్త భీమారావు సర్పంచ్ గా రెండుసార్లు పనిచేసి ఆ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించారన్నారు. ఒకనాడు వెనుకబడిన గ్రామంగా ఉన్న వానపల్లిని ముఖ్యమంత్రి సైతం వచ్చి అభినందించేలా వారు అభివృద్ధి చేశారన్నారు.ఇక కొత్తపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన  కంఠంశెట్టి శ్రీనివాసరావు సుదీర్ఘంగా తెలుగుదేశం మండల పార్టీ ప్రెసిడెంట్ గా, కొత్తపేట గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ గా అనేక సేవలు అందించారని అటువంటి నాయకునికి అవకాశం ఇవ్వడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు దక్కిన గౌరవంగా ఎమ్మెల్యే అభివర్ణించారు. వ్యవసాయం, రైతన్నల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందన్నారు. దేశ వ్యవసాయ ఉత్పత్తుల్లో 10 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుందన్నారు. వ్యవసాయ వృద్ధి రేటు 15శాతానికి పెంచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషిచేస్తున్నారన్నారు. సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి సారించడం, బిందు సేద్యం, గిట్టుబాటు ధరలు,ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాల్లో పెనుమార్పులు తీసుకొస్తున్నారన్నారు. తన హయంలోనే రావులపాలెం మార్కెట్ యార్డు నిర్మాణం జరిగిందన్నారు.అరటి, కొబ్బరి పంటల ఉప ఉత్పత్తులపై సైతం దృష్టి సారించాలన్నారు. అరటి వ్యర్ధాలతో ఉత్పత్తులు తయారు చేయడానికి ఎంఎస్ఎమ్ఈ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు.

దేవరపల్లి లో బనానా ఇంక్యూబేషన్ సెంటర్ ఏర్పాటుకు రెండు ఎకరాలను కేటాయించడం జరిగిందన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి రైతన్నల సంక్షేమానికి కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు