.....గత నవంబర్ లో ఖరీఫ్ రావాల్సిన బకాయిలు ఇప్పటికీ చెల్లించని వైనం
..........జిల్లాలో కోట్ల రూపాయల్లో ధాన్యం రవాణా బకాయిలు
........... ఇ ఎం ఐ లు, అప్పులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న లారీల యజమానులు
చింతలపూడి .................................
గతేడాది చెల్లించాల్సిన ధాన్యం రవాణా బిల్లులు కూటమి ప్రభుత్వం చెల్లించక పోవటంతో జిల్లాలో ఉన్న లారీ యజమానులు అప్పుల పాలై లబోదిబో అంటున్నారు.ఏదో ప్రభుత్వం ద్వారా లారీ కిరాయి లు వచ్చి ఓ రూపాయి మిగులుతుంది అనుకుంటే బిల్లు బకాయిలు ప్రభుత్వం చెల్లించక పోవడంతో అప్పుల పాలు అయ్యాం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలువురు లారీ యజమానులు.గత ఏడాది ఖరీఫ్ సీజన్ కు సంబంధించి నవంబర్ నెలలో ప్రభుత్వం వివిధ ఐ కె పి కేంద్రాల ద్వారా ధాన్యం ను మిల్లులకు చేరవేసేలా లారీలను ప్రభుత్వం కిరాయులకు ఏర్పాటు చేసింది.దీనితో జిల్లాలో వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ను లారీ ల ద్వారా మిల్లులకు చేరాయి.అసలే అంతంత మాత్రంగా కిరాయి లు ఉన్నాయని,ప్రభుత్వం నుండి కిరాయి అంటే సకాలంలో బిల్లులు వస్తాయి అని ఆశ పడి జిల్లాలో కొందరు లారీ యజమానులు అప్పుల చేసి మరీ లారీ లో ఆయిల్ , డ్రైవర్ జీతాలను లను ఏర్పాటు చేసి రవాణా చేశారు. ధాన్యం ఐ కె పి ల ద్వారా రవాణా చేసి ఇప్పటికీ ఐదు నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా బకాయిలు చెల్లించలేదని పలువురు లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.2024 లో ధాన్యం రవాణా బిల్లులు చెల్లించారు అని,అదే విధముగా గత ఏడాది ఖరీఫ్ సీజన్ లో బకాయిలు చెల్లిస్తారు అని ఆశ పడి రవాణా చేశామని,తీరా చూస్తే ఐదు నెలల్లో బకాయిలు చెల్లించక పొగ కనీసం బిల్లులను ఆన్లైన్ కూడా చేయలేదు పలువురు లారీ యజమానులు వాపోయారు.తాము అప్పులు చేసి మరీ రవాణ చేశాం అని
ఇన్ని నెలలు బకాయిలు చెల్లించక పోతే వడ్డీలు, ఇ ఎం ఐ లు ,డ్రైవర్ ల జీతాలు ఎలా కడతాం అని ఆవేదన వ్యక్తం చేశారు.ఒక్క చింతలపూడి పట్టణంలో నే సుమారు రెండు కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే జిల్లాలో ఎన్ని కోట్లు బకాయిలు ఉన్నాయి అని,రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి మనోహర్ ఇంచార్జిగా ఉన్న జిల్లాల్లోఇలా ఉంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందో అని పలు సంఘాల నాయకులు అన్నారు.కూటమి ప్రభుత్వం వెంటనే బకాయి బిల్లులు చెల్లించి అప్పుల బారి నుండి కాపాడాలని లారీ యజమానులు కోరుతున్నారు.
