నూతన ప్రెస్ క్లబ్ ను ఆశ్రయించి ఆదరించే వారికి వార్తలు వ్రాయండి
నూతన ప్రెస్ క్లబ్ కమిటీ సూచనఅమలాపురం మార్చి 8: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నూతన ప్రెస్ క్లబ్ ఆవిర్భావం రిజిస్ట్రేషన్ తో అఫీషియల్ గా జరిగింది. జిల్లా నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా నాగ శ్రీనివాసరావు ను జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఉపాధ్యక్షులు గా నల్లా నరసింహమూర్తి, ప్రధాన కార్యదర్శిగా సూరపరెడ్డి శ్రీరామ్మూర్తి, గౌరవాధ్యక్షులుగా సీనియర్ పాత్రికేయులు రెడ్డి బాబు, మరో గౌరవాధ్యక్షులుగా డాక్టర్ కె.వి.రామారావు, ట్రెజరర్ గా గోకర కొండ పద్మరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సత్తి సత్య వరప్రసాద్, జాయింట్ సెక్రటరీగా దేవ్ మహేష్, సభ్యులుగా సురేష్, గుర్రం రాంబాబు, తదితరులు క్లబ్ అసోసియేషన్ సభ్యులు ఎన్నుకున్నారు. మరో 30 మంది రిపోర్టర్లతో అమలాపురంలో నూతన ఆవిర్భావం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా పలువురు సిటిజన్ పాత్రికేయులు మాట్లాడుతూ ఈ నూతన ప్రెస్ క్లబ్ లో,, డిగ్రీ, లా, డాక్టట్ లు ఉండడం శుభపరిణామం అని అన్నారు. అమలాపురంలో మన నూతన ప్రెస్ క్లబ్ ను ఆదరించి ఆశ్రయించే వారికి అండదండలుగా నిలబడి వారికి వార్తలు వ్రాయాలని సూచించారు. జిల్లాలో నలుమూలల నుండి సీనియర్ పాత్రికేయులు మన ప్రెస్ క్లబ్ లో చేరేందుకు వస్తున్నారని, వారిని తీసుకోవాలంటే మినిమం క్వాలిఫికేషన్, ప్రెస్ క్లబ్ సేవా సంక్షేమ సిద్ధాంతాలు, నియమ నిబంధనలు తో చేర్చుకోవడం జరుగుతుందని, త్వరలో అమలాపురం గడియార స్తంభం సెంటర్ వద్ద నూతన ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం ఘనంగా జరుపుకుందామని అన్నారు.
