ఆలమూరు మండలాన్ని తూగో జిల్లాలో విలీనం చేయాలి.

ఆలమూరు:-జిల్లాల పునర్విభజనలో భాగంగా ఆలమూరు మండలాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయాలని కోరుతూ పలువురు మండల ప్రజలు పిలుపునిచ్చాయి. జొన్నాడ రైతు భవనం (పెద్ద కళ్యాణ మండపం) వేదికగా పలు రాజకీయ, ప్రజా సంఘాల పార్టీలకు అతీతంగా ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విద్య, వైద్యం అన్ని రంగాలు రాజమహేంద్రవరంతోనే అనుబంధం ఉండటంతో పాటు, జిల్లా కేంద్రమైన అమలాపురం దూరంగా ఉండటం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.మన మండలాన్ని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కలపాలని, ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యమ కార్యాచరణకు తగిన ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు. ప్రతీ గ్రామ పంచాయతీ నుంచి మండలాన్ని తూర్పుగోదావరిలో కలపాలని తీర్మానాలు సేకరిస్తున్నామని,త్వరలోనే ప్రభుత్వ అధికారులు,రాజకీయ నాయకులకు వినతి పత్రాలు అందజేస్తామన్నారు. పలువురు రాజకీయ నాయకులు,18 గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు రైతులు,విద్యార్థులు, ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారన్నారు. అనంతరం 35 మంది సభ్యులతో జేఏసీ కమిటీని ఏర్పాటు చేసి, ఐదుగురు సభ్యులతో స్టీరింగ్ కమిటీని నియమించారు. ఈ సభ్యులందరూ కలిసి ఒకే కార్యచరణకు ముందుకు సాగుతారు అన్నారు. ఈ కార్యక్రమంలో కొపనాతి శ్రీనివాసరావు, తాడి మధుసూదనరెడ్డి,సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ సత్తిబాబు,వ్యవసాయ కార్మిక సంఘం నుండి కె.రామకృష్ణ,బి.స్.పి. నుండి గుర్రపు కొత్తియ్య,ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రవికుమార్,అధ్యక్షులు వెంకట్, నెక్కంటి వెంకటరాయుడు (బుజ్జి) సర్పంచులు గుణ్ణం రాంబాబు, కట్టా శ్రీనివాస్,దూలం సత్తిబాబు,నాతి కుమార్ రాజా,చింతపల్లి నాగేశ్వరరావు,పాలింగి ఉమాదేవి, షేక్ షరీఫ్, కట్టా ప్రసాద్,పలువురు ప్రజా సంఘాల నాయకులు,తదితరులు పాల్గొన్నారు._