కూటమి పాలనకు నిదర్శనం.. ఇళ్ళ వద్దకే పెన్షన్ పంపిణీ
హిందీలో సంభాషిస్తూ.. ముస్లిం సోదరుల కష్టసుఖాలు విచారించిన రెడ్డి అనంత కుమారికొత్తపేట, (ఏప్రిల్ 01): అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట గణేష్ కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం బుధవారం ఒక పండుగలా సాగింది. రాష్ట్ర బీసీ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి రెడ్డి అనంత కుమారి గారు ఉదయాన్నే లబ్ధిదారుల ముంగిట నిలిచారు. ముఖ్యంగా వికలాంగులు మరియు నడవలేని స్థితిలో ఉన్న వారి వద్దకు స్వయంగా వెళ్లి పెన్షన్ అందజేస్తూ వారిలో భరోసా నింపారు.
అందరినీ ఆకట్టుకున్న 'అనంత' సంభాషణ:
పెన్షన్ పంపిణీ సమయంలో గణేష్ కాలనీలోని ముస్లిం మైనారిటీ సోదరులతో అనంత కుమారి గారు అత్యంత ఆత్మీయంగా హిందీలో సంభాషించడం అందరినీ ఆకట్టుకుంది. "ప్రభుత్వ సేవలు ఎలా అందుతున్నాయి? మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా?" అని ఆమె హిందీలో అడిగి తెలుసుకున్నారు. దీనికి లబ్ధిదారులు స్పందిస్తూ, "చాలా బాగుంది (బహుత్ అచ్చా హై), మా గడప వద్దకే పెన్షన్ రావడం సంతోషంగా ఉంది" అని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రెడ్డి అనంత కుమారి గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రకారం.. ప్రభుత్వం ప్రజల వద్దకు వెళ్లాలి తప్ప, ప్రజలు ప్రభుత్వం చుట్టూ తిరగకూడదు.అందుకే ఉదయాన్నే ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టాం.మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఎప్పటికప్పుడు ఐటీ మరియు ఆధునిక పద్ధతులతో క్షేత్రస్థాయిలో సేవలను పర్యవేక్షిస్తున్నారు.అందుకే నేడు వికలాంగులకు సైతం ఎక్కడా ఇబ్బంది లేకుండా వారి పడకల చెంతకే పెన్షన్ చేరుతోంది."కులమతాలకు అతీతంగా, భాషా బేధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. పేదల ముఖాల్లో ఈ చిరునవ్వులే ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, లోకేష్ గారికి అసలైన దీవెనలు," అని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈఓ దాసరి వెంకటేశ్వరావు, దూనబోయిన ప్రదీప్, స్థానిక కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
