భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం రాయకుదురు గ్రామానికి చెందిన మైనర్ బాలికను నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అని మాయమాటలు చెప్పి సుమారు సంవత్సరము నుండి మైనర్ను వెంటపడి వంచించి ఏడు నెలలు గర్భవతిని చేసిన ఘనుడు పోలిశెట్టి పెద్దిరాజు నుబాధితురాలు తరుపున కుటుంబ సభ్యులు పెళ్లి విషయం అడగగానే మొఖం సాటేసుకున్నాడు....కొంతమంది పెద్దలతో జరిగిన సంఘటన చెప్పగా వారు అడగగా ఏమీ తెలియనట్టు వెళ్లిపోయాడు బాధితురాలు కుటుంబానికి గత్యంతరం లేని పరిస్థితులో సంబంధించిన వీరవాసరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సబ్ ఇన్స్పెక్టర్ గారు బాధితురాలు వాంగ్మూలం తీసుకుని కేసు నమోద్ చేసిన సబ్ ఇన్స్పెక్టర్.
.చింతపల్లి గురుప్రసాద్ వైయస్సార్ సిపి బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ కూటమి నాయకుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో వాలంటీర్స్ ద్వారా 30 వేల మంది స్త్రీలను వ్యభిచార గృహాలకు అమ్మేసారని విషం కక్కిన మీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎం అయిన మీరు ఒక్క స్త్రీనైనా ఆ వ్యభిచార గృహం నుంచి తీసుకురాగలిగారా! ( కనీసం పోలీస్ స్టేషన్ల వారీ ఎంతమంది స్త్రీలు మాయం అయ్యారో ఇంతవరకూ, ఇప్పటివరకు పేర్లు గాని, సంఖ్య గానీ వెల్లడించక పోవటం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.లేదా ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి)నేడు కూటమి ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులు కల్తీ మద్యం డ్రగ్స్ గంజాయి సేవిస్తూ యువతని పెడమార్గం పట్టిస్తూ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్న మీరు ఈ సమాజాన్ని ఎటు తీసుకుపోదామనుకుంటున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరములు పూర్తి కాకముందే బడుగు బలహీన వర్గాలకు చెందిన వార్ని, స్త్రీలు పై అత్యాచారాలు హత్యలు దాడులు రోజు రోజుకి పెట్రేగిపోతున్నారని ఎస్సీ,ఎస్టీ,బీసీ మరియు మైనార్టీ వర్గాలకు రక్షణ లేకుండా పోతుంది అని నేరాలకు పాల్పడుతున్న కూటమి నాయకులకు పై కేసులు నమోదం చేయడం లేదు, నేరగాళ్లకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తున్నారు వీళ్ళ దుర్మార్గాలను ప్రశ్నించిన వారిపై RED BOOK పాలన అమలు చేస్తూ అమాయకులపై అక్రమ కేసులు బనాయించి నాన్ బెయిల్ సెక్షన్లు కింద వివిధ కేసులు బనాయించి నెలలు గడుస్తున్న బెయిల్ రాకుండా కటకటాల మధ్యన నలిగిపోతున్నారనిదుయ్యబట్టారు.కూటమి ప్రభుత్వం లో అభివృద్ధి లేదు సంక్షేమం లేదు చేస్తున్నదల్లా రాక్షస పాలన ఇదే కొనసాగితే ప్రజలు చూస్తూ ఊరుకోరని రానున్న కాలంలో తగిన బుద్ధి చెబుతారని గురుప్రసాద్ జోష్యం చెప్పారు..ఈ బాధితురాలకు న్యాయం జరిగే వరకూ వైయస్సార్సీపి నాయకులు తోడుగా ఉంటామని వైయస్సార్సీపి బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి గురుప్రసాద్
