MOVIE'S NEWS: కన్నడ సినిమా కాంతార 2022లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ విజయం దక్కించుకుంది. కన్నడతోపాటు ఈ సినిమాకు తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ చిత్రం ఓవరాల్ గా లాంగ్ రన్ లో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ.400 కోట్లకుపైగా సాధించింది. అయితే ఈ సినిమాకు వచ్చిన భారీ రెస్పాన్స్ తో మేకర్స్ దీనికి ప్రీక్వెల్ నిర్మించారు. కాంతార ఛాప్టర్ 1 పేరుతో ఇది తెరకెక్కింది.
ఇందులో పార్ట్ 1 కంటే ముందు ఏంటి అనేది చూపించనున్నారు. ఈ సినిమాను కూడా రిషభ్ శెట్టియే స్వయంగా తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తైంది. ఈ సినిమాను 2025 అక్టోబర్ 01న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ పనుల్లో పడ్డారు.
అంచనాలు లేకుండా వచ్చిన తొలి పార్ట్ భారీ విజయం సాధించడంతో రెండో భాగంపై కూడా ప్రేక్షకుల్లో ఆత్రుత పెరిగిపోయింది. అలా సినిమాకు ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వకముందే భారీ హైప్ వచ్చేసింది. ఈ క్రేజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ లో కనిపించింది. బడా స్టార్ హీరోల సినిమాలకూ ఏ మాత్రం తీసిపోకుండా కాంతారా ఛాప్టర్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు ఏకంగా రూ.100 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.
రూ.100 కోట్లలో నైజాం హక్కులు రూ.40 కోట్లకు, కోస్తాంధ్ర ప్రాంతంలో రూ.45 కోట్లు, సీడెడ్ ఏరియాల్లో రూ.15 కోట్లకు అమ్ముడయ్యాయి. కేవలం తొలి పార్ట్ హిట్టైన అంచనాలతో రెండో భాగం ప్రీ రిలీజ్ బిజినెసే రికార్డు స్థాయిలో జరగడం అరుదైన రికార్డు. అది కూడా ఈ సినిమా స్ట్రైట్ తెలుగు సినిమా కాదు. ఇదొక డబ్బింగ్ చిత్రం కావడం ఇక్కడ మరో విశేషం. ఆ నేపథ్యంలోనే డబ్బింగ్ సినిమాకు ఇంత భారీ మొత్తం ధర దక్కడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.
కాగా, ఇందులో రిషభ్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. యంగ్ బ్యూటీ రుక్మిణీ వసంత్ కీ రోల్ లో నటిస్తుంది గుల్షన్ దేవయ్య ప్రముఖ పాత్రలో హోంబాలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిచింది. అంచనాలు అయితే మాత్రం తారా స్థాయిలో ఉన్నాయి. కానీ, బాక్సాఫీస్ వద్ద ఇది ఏ రేంజ్ లో పెర్ఫార్మెన్స్ చేస్తుందో చూడాల్సి ఉంది.