వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన ఉద్యోగులకు ఈ పీ ఎఫ్, 20 లక్షల ఆరోగ్య భీమా ప్రకటన

 


 ఉద్యోగుల జీవితాల్లో ముందుగానే దసరా పండుగ నింపిన ఎమ్మెల్యే సత్యానందరావు

 ఎమ్మెల్యే,ఛైర్మెన్,డిప్యూటీ కమిషనర్ లకు కృతజ్ఞతలు తెలిపి గజమాలతో సత్కరించిన ఉద్యోగులు

ఆత్రేయపురం :

కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వివిధ రకాల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఈ పీ ఎఫ్ మరియు 20 లక్షల రూపాయల భీమా సౌకర్యం కల్పిస్తున్నట్టు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రకటించారు. ఈ ఎంప్లాయిమెంట్ ప్రావిడెంట్ ఫండ్ కి 12 శాతం దేవస్థానం భరిస్తుందని,ఉద్యోగుల జీతం నుండి 13 శాతం తీసుకుంటారని తెలిపారు.అలాగే ఉద్యోగుల మరియు వారి కుటుంబ సభ్యులకు 20 లక్షల ఆరోగ్య బీమాను కూడా వర్తింప చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు.దీంతో దేవస్థానం ఉద్యోగుల జీవితాల్లో ముందుగానే దసరా పండుగ నెలకొందని ఉద్యోగులు ఆనందం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావుకు ఇటీవల ఆలయ కమిటీ చైర్మన్ గా నియమితులైన ముదునూరి వెంకట్రాజు (గబ్బర్ సింగ్)కు ,ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్ల చక్రధరరావుకు ఉద్యోగుల తరపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.దేవస్థానం ఉద్యోగులంతా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారిని,నూతన ఛైర్మెన్ ముదునూరి వెంకటరాజు గారిని,ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరావు గారిని గజమాలతో సత్కరించారు.