అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ధార్ గ్యాంగ్


డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి

రాత్రి సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచిస్తున్నారు. అయినవిల్లి మండల పరిధిలోని ప్రజలు ఒంటరిగా తిరగవద్దని అర్ధరాత్రుళ్లు తలుపు తడితే తీయవద్దని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 100కు ఫోన్ చేయాలని అయినవిల్లి ఎస్ఐ హరికోటి శాస్త్రి సూచించారు. 

దోపిడీలకు, దాడులకు పాల్పడే మధ్యప్రదేశ్ కు చెందిన ధార్ గ్యాంగ్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిసరాల ప్రాంతాల్లో తిరుగుతోందని పోలీసులు మండల ప్రజలను హెచ్చరిస్తున్నారు.

 ఈ ధార్ గ్యాంగ్ గ్రామాల శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు వెల్లడించారు. రాత్రి సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ థార్ గ్యాంగ్ ఆరుగురు ఉన్న ఒక రాబరీ గ్యాంగ్ ఒకటి మన ఏరియాలలో తిరుగుతున్నారని తెలిపారు

 ఈ గ్యాంగ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో రావులపాలెం,ఆలమూరు,మండపేట, రామచంద్రాపురం ,అమలాపురం, రాజోలు, ముమ్మిడివరం ఏరియాలలో దొంగతనాలు చేసే అవకాశం ఉన్నందని తెలిపారు. వీళ్లు తక్కువ రేటు ఉన్న లాడ్జ్ లలో, రిహార్సల్స్ లో ఉంటున్నారన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరన్నా ఉంటే వారి పూర్తి వివరాలు తీసుకోవాలని తెలిపారు. వీళ్ళు పగలు రక్కి చేసి రాత్రులు నలుగురు లేక ఐదుగురు కలసి రోబరి చేస్తారన్నారు. మండల పరిధిలో ఎక్కడైనా నేరం చేసే అవకాశం ఉన్నందున అన్నీ లాడ్జ్ / హెూటల్, దాబాల యాజమాన్యం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని తెలిపారు. ఈ గ్యాంగ్ ఉదయం వేళల్లో ఆటోల్లో తిరుగుతూ రెక్కీ నిర్వహిస్తున్నారు. ఇక అర్ధరాత్రి కాగానే రెక్కీ నిర్వహించిన ఇళ్లలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడు తున్నారు. అడ్డువచ్చిన కుటుంబ సభ్యులపై దాడుల్న చేస్తున్నారు. ఆపై ఇళ్లల్లో ఉన్న బంగారం, డబ్బు, ఇతర విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లిపోతున్నారని తెలిపారు. ఒక్కో గ్యాంగులో ఐదుగురు, అంతకంటే ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. అర్ధరాత్రుళ్లు ఎవరైనా తలుపు తడితే తీయవద్దని... వచ్చిన వారు ఎవరో నిర్ధారించుకోవాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కు ఫోన్ చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ హరికోటి శాస్త్రి సూచించారు.