34 మంది పై కేసులు.. ఇద్దరిపైనే కోర్టులో ఫైలింగ్... ఆగస్టు నెలాఖరు నాటికి రూ 26 లక్షలు బకాయిలు

 

మండపేట పురపాలక సంఘం...

ఆదాయం ఘనం.... పేరుకుపోతున్న బకాయిలు... పెరిగిన అద్దె...

వసూళ్లపై దృష్టి సారించిన రెవెన్యూ... 

34 మంది పై కేసులు.. ఇద్దరిపైనే కోర్టులో ఫైలింగ్... ఆగస్టు నెలాఖరు నాటికి రూ 26 లక్షలు బకాయిలు...

సత్యం టీవీ,మండపేట:

మండపేట పురపాలక సంఘం ఆదాయం పుష్కలంగా ఉంటుంది. ఇక్కడ వాణిజ్య సముదాయాలు ఎక్కువ ఉండటమే దీనికి కారణం. కాగా నెలలు తరబడి అద్దె బకాయిలు ఉండడంతో వాటి వసూళ్లపై మున్సిపల్ రెవెన్యూ విభాగం దృష్టి సారించినట్లు మున్సిపల్ ఆర్వో జెవిఎస్ శాస్త్రి తెలిపారు. ఆగస్టు నెలాఖరు నాటికి రూ 26 లక్షలు బకాయిలు ఉన్నట్లు ఆయన తెలిపారు. అద్దె చెల్లించని 34 మందిపై ఆలమూరు కోర్టులో కేసులు వెయ్యాలని మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్కు ప్రతిపాదించామని చెప్పారు. కేవలం ఇద్దరిపై మాత్రమే కేసులు ఫైల్ చేశారని మిగిలిన వారిపై ఈ నెలాఖరులోగా కేసులు ఫైల్ చేస్తామని ఆయన వెల్లడించారు. కేపీ రోడ్డు సర్దార్ వేగుళ్ళ వీర్రాజు మార్కెట్ వద్ద షాపు గెద్దాడ సూర్య నారాయణ రూ 6.54 లక్షలు బకాయి పడ్డారని, అలాగే గోమాడ వెంకట రాజేష్ ట్రావెల్స్ బంగ్లా వద్ద షాపులో రూ 7.11 లక్షలు అద్దె బకాయి ఉండగా ఇరువురి పై కోర్టులో కేసులు వేసినట్లు ఆయన తెలిపారు. మండపేట మున్సిపాలిటీలో షాపు ఉంటే అదో క్రేజ్. సొంత షాప్ లో ఉన్నట్టే లెక్క. కాగా ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు 25 ఏళ్లు పూర్తిచేస్తే తిరిగి వేలం పాట నిర్వహిస్తారు. దీంతో అద్దులు ప్రైవేట్ షాపులకు సమానంగా పెరిగిపోయాయి. దీంతో వ్యాపారాలు జరగక అద్దెలు చెల్లించలేక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. అద్దె చెల్లించకపోవడంతో మున్సిపాలిటీ నుండి ఒత్తిడి పెరిగిపోతుంది. దీంతో బకాయిలు కొండల పెరిగిపోతున్నాయి. మండపేటలో మొత్తం 235 షాపులు మున్సిపల్ షాపులు ఉన్నాయి. మొత్తం 9 ప్రదేశాల్లో ఇవి ఉన్నాయి. 45 షాపులు ఖాళీగా ఉండగా 71 షాపులు అద్దె బకాయిలు పడ్డాయి. కేపీ రోడ్ సర్దార్ వేగుళ్ళ వీర్రాజు మార్కెట్ వైపు మొత్తం 21 షాపులు ఉన్నాయి. వీటిలో రెండు షాపులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ అద్దె నెలకు ఒక షాపుకు రూ 25వేలుగా ఉంది. 11 షాపులు అద్దె బకాయిలు పడగా రూ 5, 679 లక్షలు బకాయి ఉంది. బస్టాండ్ సమీపంలోని ట్రావెల్స్ బంగ్లా వద్ద పైన కింద కలిపి 39 షాపులు ఉన్నాయి. పై అంతస్తు 15 షాపులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ నెలకు అద్దె రూ. 17,200 కాగా 6 షాపులు నిర్వాహకులు అద్దె రూ 3, 99, 536 బకాయి పడ్డారు. వాణి మహల్ విగ్రహాల వైపు 20 షాపులు ఉన్నాయి. నెలకు ఇక్కడ ఒక్కో షాపుకు 19 వేలు అద్దె ఉంది. ఖాళీ గా రెండు షాపులు ఉన్నాయి. 11 షాపులు అద్దె రూ 8,40,150 లు అద్దె బకాయి ఉంది. కల్వ పువ్వు సెంటర్ సర్దార్ వేగుళ్ళ వీర్రాజు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ గుడ్ విల్ షాపులు 37 ఉన్నాయి. మూడు అంతస్తుల్లో షాపులు ఉన్నాయి . ఇకడ నెలకు 18,550 ఒక్కో షాపుకు అద్దె ఉంది. పై అంతస్తులు 12 షాపులు ఖాళీగా ఉన్నాయి. 10 షాపులు అద్దె బకాయిలు 2,70,112 బకాయి పడ్డారు. బురుగుంట చెరువు షాపు వద్ద 16 షాపులు పైన కింద ఉన్నాయి. ఇక్కడ ఒక్కో షాపు 4,890 అద్దెకు ఉంది. ఖాళీగా నాలుగు షాపులు ఉన్నాయి. నాలుగు షాపులు అద్దె బకాయిలు రూ 47,437 చెల్లించవలసి ఉంది. వాణి మహల్ కరాచీ సెంటర్ ఆక్రమణల షాపులు 30 ఉన్నాయి. ఇక్కడ ఒక్కో షాపుకు రూ 2,400 అద్దె ఉంది. 19 షాపులు అద్దె బకాయిలు రూ2, 48,392 లు ఉన్నాయి. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఐడి ఎస్ఎంటి స్కీమ్ షాపులు 45 ఉన్నాయి. ఒక్కో షాపు అద్దె రూ 11,377 గా ఉన్నాయి. 9 షాపులు ఖాళీగా ఉన్నాయి. ఏడు షాపులు వారు రూ 1,70,332 బకాయి చెల్లించాల్సి ఉంది. టాక్సీ స్టాండ్ ఆక్రమణల షాపులు 24 ఉన్నాయి. ఇక్కడ ఒక్కో షాపుకు అద్దె రూ1600 కాగా ఇద్దరు రు 8,675 లు అద్దెబాకాయి పడ్డారు. గొల్లపుంత కాలనీలో మూడు షాపులు ఉన్నాయి. ఒక్కో షాపు అద్దె 2,600 కాగా ఒక షాపు ఖాళీగా ఉంది. ఒక షాపు అద్దె బకాయి రూ 40, 812 ఉంది . మొత్తం 235 షాపులు ఉన్నాయి. మొత్తం 45 షాప్ లు ఖాళీగా ఉన్నాయి. 71 షాపులు అద్దె బకాయిలు వున్నారు. మొత్తం రూ 25,92,715 ఆగస్టు నెలాఖరు నాటికి అద్దె పెండింగ్ ఉంది. సెక్టెంబర్ చివరికి బకాయిలు లేకుండా మునిసిపల్ రెవెన్యూ శాఖ ప్రణాళికలు సిద్ధం చేశారు.