డాక్టర్ చల్లా ను ఘనంగా సన్మానించిన వాసవి వనిత క్లబ్ మహిళలు.



ఆలమూరు:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజక వర్గ పరిధిలోని ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశాలు మేరకు డిస్ట్రిక్ట్ వి 215 రీజన్ 4 ఆధ్వర్యంలో వెత్సా వారి రికాన్ 2025 వెత్సా రవి సౌజన్యల ఉత్సవం పేరిట అవార్డు ప్రదానోత్సవం,సాహిత్య సాంస్కృతిక కార్యక్రమలు నిర్వహించారు. సమాజంలో ఆర్యవైశ్యులలో స్నేహం నాయకత్వం వ్యాపార వృద్ధి సేవా కార్యక్రమాల నిమిత్తం ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖవ్యాపారవేత్త,జాతీయ సేవా పురస్కార్ అవార్డు గ్రహీత డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు ను వాసవి వనిత క్లబ్ మహిళలు దుశ్శాలువా కప్పి,ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా డాక్టర్ చల్లా మాట్లాడుతూ ఆర్యవైశ్యులు సేవా కార్యక్రమాల్లో ముందుంటారని,అలాగే వాసవి వనిత మహిళాసోదరీమణులు కూడా వాసవి క్లబ్ ల ద్వారా మంచి సేవా కార్యక్రమాలు చెయ్యడం చాలా సంతోషకరమని వారిని అభినందించారు.ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా మెాహన లక్ష్మీ కీర్తన పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పి నారాయణమూర్తి, బోడా వీర్రాజు ,కంచర్ల స్వాతి, వెత్సా సునంద, కంచర్ల పావని, కేఎస్ భాస్కరరావు, వెత్సా లక్ష్మి శ్రీనివాస్,వెత్సా సురేఖ, తుమ్మలపల్లి సాయి లక్ష్మి, వై సంతోషి, కే శారదా దేవి క్లబ్ సభ్యులు పెద్దలు,ఎలుగుంటి బూరయ్య,వాసంశెట్టి దుర్గాభవానిసాయిబాబా,ఎరుకొండ గణేష్,సామంతుల నాని,లంకే వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.