కాజులూరు మండలంలో రూ.2.40 కోట్ల రోడ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి సుభాష్
అభివృద్ధి, సంక్షేమం నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తాం - మంత్రి
కాజులూరు రామచంద్రపురం నియోజవర్గం కాజులూరు మండలంలో రూ.2 కోట్లు 40 లక్షల వ్యయంతో నిర్మించనున్న పలు రహదారి అభివృద్ధి పనులకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం శంకుస్థాపన చేశారు. మండలంలోని ఉండూరు బ్రిడ్జి నుంచి పటవల వరకు రూ.2 కోట్లతో రహదారి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే గొల్లపాలెం నుంచి కుయ్యేరు (చేదువాడ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు) వరకు రూ. 40 లక్షలుతో నిర్మించనున్న రహదారి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రహదారుల నిర్మాణం కీలకమని, మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. రామచంద్రపురం నియోజవర్గంలో ఇప్పటివరకు రూ.150 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టమన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, డైరెక్టర్ దడాల నాగార్జున, ఆర్&బీ ఏఈ లక్ష్మీప్రసన్న, కాజులూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు బొండా వెంకన్న,మంజేరు ఎంపీటీసీ గండి మణికంఠ, మంజేరు సొసైటీ ధర్మరాజు,కోలంక సొసైటీ అధ్యక్షులు బొండా వెంకట నరసింహ నాయుడు, ఉప్పిమిల్లి ఎంపీటీసీ యాళ్ల కృష్ణ మూర్తి,కాజులూరు డీసీ కృష్ణ చైతన్య, నాయకులు వేగుబంట్ల శ్రీరామచంద్రమూర్తి,సలాది నానాజీ,కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు
