రహదారుల అభివృద్ధి లక్ష్యం....
మండపేట – దుళ్ళ రోడ్డుకు రూ. 3.50 కోట్లతో రహదారి పనులకు శ్రీకారం...
ఎమ్మెల్యే వేగుళ్ళ...
మండపేట
రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. సోమవారం అన్న క్యాంటీన్ వద్ద మండపేట – దుళ్ళ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వేగుళ్ళ శంఖుస్థాపన చేశారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఇందులో భాగంగా శాస్కి నిధులు ద్వారా మండపేట – దుళ్ళ రహదారి నిర్మాణ పనులకు రూ. 3.50 కోట్లు కూటమి ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఈ రోడ్డు 10 మీటర్ల వెడల్పుతో సిమెంట్ రోడ్డుగా నిర్మాణం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పుర పాలక సంఘం చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి,కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆర్&బి అధికారులు, తదితర్లు పాల్గొన్నారు
