డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాలు అందించిన బిజెపి అల్లవరం మండల అధ్యక్షులు కట్టా నారాయణమూర్తి


 అల్లవరం మండలంలో నెలకొన్న సమస్యలపై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాలు అందించిన బిజెపి అల్లవరం మండల అధ్యక్షులు కట్టా నారాయణమూర్తి 

 అల్లవరం మండలంలో ఓఎన్జిసి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సోలార్ విద్యుత్ ద్వీపాలు  వేలగకపోవడంతో చీకటిలో ప్రజలు ఇబ్బంది పెడుతున్నారని.. మరియు మొగళ్ళమూరు పంచాయతీ పరిధిలోని సిరిగట్లపల్లి R&B కి సంబంధించిన రోడ్డు గుంతల మయంగా మారడం వల్ల ప్రజలు, మరియు విద్యార్థులు అనేక ఇబ్బందులు పాలు అవుతున్నారని.. అలాగే అల్లవరం మండలంలో స్కూల్ జోన్ పరిధిలో ఉండవలసిన రక్షణ చర్యల గురించి వివరించి త్వరితగతిన మండలంలో  మెయిన్ రోడ్ సమీపంలో ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేటు పరిధిలో స్కూల్ జోన్ లో ఉండవలసిన రక్షణ చర్యలు వెంటనే ఏర్పాటు చేయవలసిందిగా కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది🙏

ఈ కార్యక్రమంలో జనతా వారిది జిల్లా కన్వీనర్ చీకురుమిల్లి  శ్రీనివాసరావు పాలూరి సత్యానందం  ఇళ్ల సత్యనారాయణ బొంతు శివాజీ అమలాపురం రూరల్ ప్రధాన కార్యదర్శి రాజు ధనుంజయ వర్మ  కట్టా జనార్ధన్ కాండ్రేగుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు