ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు పార్టీ కార్యక్రమాలను ముందుకుతీసుకెళ్లేందుకు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు.

 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారితో కలిసి రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి ఇందుకూరి నరసింహరాజు గారు, వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.



ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలు మరియు కోనసీమ జిల్లాలో పార్టీ సీనియర్ల సేవలను గుర్తిస్తూ సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరంపై విస్తృతంగా చర్చించారు. ప్రజలకు మరింత చేరువగా ఉండేలా పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లేందుకు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు.

పార్టీ సిద్ధాంతాలు మరియు ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతూ, నాయకులు – కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తే రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలపడుతుందని ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు.