కొత్తపేటలో పెట్రోల్ బంకులు తనిఖీ చేసిన రెవెన్యూ డివిజనల్ అధికారి జి. మమ్మీ



కొత్తపేట మండలం కొత్తపేట గ్రామంలో దేవి ఎనర్జీ స్టేషన్ (IOCL)పెట్రోలు బంకు వద్ద ఆదివారం ఉదయం స్థానిక రైతులు ఆందోళన చేస్తున్నారనే విషయం తెలుసుకున్న ఆర్.డి.ఓ, తనిఖీ నిర్వహించారు. తహశిల్దార్, డిప్యూటీ తహశిల్దార్ (పౌర సరఫరాలు),స్టేషన్ హౌస్ ఆఫీసర్,కొత్తపేట వారు సంయుక్తంగా తనిఖీ చేసి, స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించిన అనంతరం పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఉన్న నిల్వలను బట్టి అందరికీ సమాన ప్రాతిపదికన పెట్రోల్, డీజిల్  విక్రయించాలని ఆర్డీవో ఆదేశించారు.ఈ విషయంలో ప్రజలకు ఏ విదమైనా ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని అందుకు అతిక్రమించిన యెడల చర్యలు తప్పవని బంకు యాజమాన్యం వారిని హెచ్చరించారు. ప్రస్తుతం నెలకొన్న పెట్రోల్ మరియు డీజిల్ కొరత దృష్ట్య ప్రజలు మరియు రైతులు ఇబ్బందులు గురికాకుండా ఇందన సరఫరా చేయాలని సంబంధిత అధికారులు, బంకు డీలర్లు ను కొత్తపేట రెవిన్యూ డివిజనల్ అధికారి  జి. మమ్మీ ఆదేశించారు.తహసిల్దార్ వై.రాంబాబు, ఎస్సై జి. సురేంద్ర, పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ బి. వెంకటేశ్వర రావు, రెవెన్యూ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.