ABN రాధాకృష్ణ పై తక్షణమే FIR వేసి చర్యలు తీసుకోవాలి..... చిర్ల జగ్గిరెడ్డి
అమలాపురం SP కార్యాలయంలో ASP కి వినతిపత్రం అందజేసిన జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై ఇన్ని సార్లు అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మరియు కొత్తపేట నియోజకవర్గం నుంచి ఆయన మీద ఫిర్యాదు చేసినా సరే ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఈ రోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అమలాపురం SP కార్యాలయం వద్ద ASP కి వినతిపత్రం అందజేశారు. ఇటీవల మహిళలను అవమానించేలా మాట్లాడటం అసహ్యకరమని, ఇలాంటి వ్యాఖ్యలు సమాజానికి హానికరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్ , ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ రావు , అమలాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ , రామచంద్రపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ పిల్లి సూర్య ప్రకాష్ మరియు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ, మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ వెంటనే ఆంధ్ర రాష్ట్ర మహిళలు అందరికి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమాజంలో మహిళలకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఇలాంటి వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.
