సాయికృష్ణను సత్కరించిన వేగుళ్ళ లీలాకృష్ణ...

 సాయికృష్ణను సత్కరించిన వేగుళ్ళ లీలాకృష్ణ...


రాజమహేంద్రవరంలో నిర్వహించిన 13వ రాష్ట్ర స్థాయి సీనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మండపేట నియోజకవర్గం రాయవరం మండలం చెల్లూరు గ్రామానికి చెందిన ఎస్. సాయికృష్ణ వీర్ 120 కేజీ విభాగంలో ద్వితీయ స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్  వేగుళ్ళ లీలాకృష్ణ  వల్లూరు లోని వారి స్వగృహంలో సాయికృష్ణను అభినందించి, దుశాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఇదివరకే జాతీయ స్థాయి బెంచ్ ప్రెస్ పోటీల్లో తన ప్రతిభను నిరూపించుకున్న సాయికృష్ణకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. సత్కారానికి స్పందించిన సాయికృష్ణ మాట్లాడుతూ, తన కోచ్ పి. జోసఫ్  మార్గదర్శకత్వం, జట్టు సభ్యుల సహకారంతోనే ఈ విజయాన్ని సాధించానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా లీలాకృష్ణ  మాట్లాడుతూ రాబోయే జాతీయ స్థాయి పోటీల్లో మరింత ప్రతిభ కనబరచి రాష్ట్రానికి గౌరవం, మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.