తాపేశ్వరం సురుచి ఫుడ్స్‌లో గీతా గాన గంధర్వుడు డాక్టర్ఎల్.వి. గంగాధర శాస్త్రి సందడి.

 


తాపేశ్వరం సురుచి ఫుడ్స్‌లో గీతా గాన గంధర్వుడు డాక్టర్ఎల్.వి. గంగాధర శాస్త్రి సందడి...

మహాశివరాత్రి జాగరణ మహోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, భగవద్గీత ఫౌండేషన్  వ్యవస్థాపకులు  డాక్టర్ ఎల్.వి. గంగాధర శాస్త్రి  ధర్మపత్నితో కలిసి సోమవారం తాపేశ్వరం సురుచి ఫుడ్స్‌ను సందర్శించారు.

శాస్త్రి దంపతులకు సంస్థ పీఆర్ఓ ఉప్పలపాటి రామ బద్రి రాజు (వర్మ)  స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తాపేశ్వరం మడత కాజా తయారీ విధానంపై వారు ఆసక్తి వ్యక్తం చేసి వివరాలు తెలుసుకున్నారు. పీఆర్ఓ  కాజా తయారీలోని విశిష్టతను వివరించి, వారికి కాజా రుచి చూపించారు.అనంతరం శాస్త్రి దంపతులను దుశాలువాతో సత్కరించి, సంస్థ ప్రత్యేకతగా నిలిచే బాహుబలి కాజాను జ్ఞాపికగా అందజేశారు.

గీతా గానంతో లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్న గంగాధర శాస్త్రి  రాకతో  ప్రాంగణంలో తమ అభిమాన కళాకారుడిని చూడటానికి స్థానికులు, సిబ్బంది ఆసక్తి కనబరిచారు. వారి రాకతో సురుచి ఫుడ్స్ వద్ద ఆనందోత్సాహ వాతావరణం నెలకొంది.