స్టెథస్కోప్ కనుకొన్న శాస్త్రవేత్త రెని థియోఫిల్ హయసింత్ లెనెక్ సేవలు చిరస్మరణీయం
సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి
ఫిబ్రవరి 17 న స్టెథస్కోప్ కనుకొన్న శాస్త్రవేత్త రెని థియోఫిల్ హయసింత్ లెనెక్ జయంతి సందర్బంగా
డోన్ పట్టణంలో సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి ఆద్వర్యం లో స్టెథస్కోప్ కనుకొన్న శాస్త్రవేత్త రెని థియోఫిల్ హయసింత్ లెనెక్ జయంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘణంగా నివాళులు అర్పించారు. వారిని స్మరించుకున్నారుఈ సందర్భంగా సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి మాట్లాడుతూ
మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారు
రెని థియోఫిల్ హయసింత్ లెనెక్ 1781 ఫిబ్రవరి 17 జన్మించారు. ఒక ఫ్రెంచ్ వైద్యుడు. ఇతను నెకర్ హాస్పిటల్ లో పనిచేస్తున్నప్పుడు 1816 లో స్టెతస్కోప్ కనుగొన్నారు, వివిధ ఛాతీ పరిస్థితులు నిర్ధారించడానికి దానిని ఉపయోగించడం మొదలుపెట్టాడు. ఈయన 45 ఏళ్ల వయసులో - 1826 ఆగస్టు 13 అనారోగ్యం తో మరణించారు. శాస్త్రీయ వాస్తవాలను ప్రపంచానికి తెలియజేసిన ఇలాంటి మహానుభావుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు అనేక పరిశోధనలు చేసి దేశానికి సేవ చెయ్యాలని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి కోరారు
