హమ్మయ్య ప్రాక్టికల్ పరీక్షలు ముగిశాయి ఆనందంలో ఇంటర్ బోర్డు అధికారులు, సిబ్బంది.

 


హమ్మయ్య... ప్రాక్టికల్ పరీక్షలు ముగిశాయి..

ఆనందంలో ఇంటర్ బోర్డు అధికారులు, సిబ్బంది...


ఇంటర్ ప్రాక్టికల్స్ ముసుగులో జరుగుతున్న "మార్కుల వ్యాపారం" మన పిల్లల భవిష్యత్తుకు ఎంత మేలు చేస్తుంది?

ఏమండోయ్ తల్లిదండ్రులారా... 

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల హడావిడి పూర్తయ్యింది.

Environment & Ethics రెండు పరీక్షలు కూడా "విజయవంతంగా" ముగిశాయి.

సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరిగాయని బోర్డు చెబుతోంది... కానీ తెరవెనుక జరుగుతున్న వాస్తవం మనందరికీ తెలిసిందే!


మన పిల్లల నిజాయితీకి, నైతికతకు విలువ లేదా? 😔

ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో:

ప్రతి ప్రాక్టికల్‌కు "నిర్వహణ ఖర్చులు" పేరుతో లేదా "మార్కుల ఏర్పాటు" అని ₹1,500 నుంచి ₹2,000+ వసూలు చేస్తున్నారు (కొన్ని కాలేజీల్లో ఇంకా ఎక్కువ).

రికార్డ్ రాయడానికి వేల రూపాయలు – కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ, జూలాజీకి విడివిడిగా ఫీజులు!

కట్టకపోతే మార్కులు తగ్గుతాయేమోనన్న భయంతో తల్లిదండ్రులు నలిగిపోతున్నారు.

ఏడాది పొడవునా ల్యాబ్ ట్రైనింగ్ ఎక్కడ? పిల్లలు ఏమీ చేయకుండానే 25–30/30 మార్కులు వచ్చేస్తున్నాయి!

ఇదేనా మనం మన పిల్లలకు నేర్పుతున్న విద్య?

మార్కులు "కొనుగోలు" చేయడమే సృజనాత్మకత అవుతుందా?

ప్రభుత్వం చూసి చూడనట్లు ఉంటే... ఇది నిజమైన విద్యా వ్యవస్థ అవుతుందా?

కేవలం ర్యాంకులు, మార్కులే మన బిడ్డల భవిష్యత్తును నిర్ణయిస్తాయా?

IIT, ట్రిపుల్ IIT, NEETలో సీట్లు సంపాదించినవారిలో ఎంతమంది నిజంగా స్వతంత్రంగా, నైతికంగా ఎదిగారు?

సమాజానికి, దేశానికి నిజంగా ఉపయోగపడుతున్నారా?

ఆలోచించాల్సిన సమయం ఇదే!

మన బిడ్డల కోసం... వారి బంగారు భవిష్యత్తు కోసం... ఈ దేశం కోసం...

మన ఆలోచన మార్చుకుందాం!

మార్కులతో కాకుండా సృజనాత్మకత, స్వాతంత్ర్య భావన, నిజాయితీతో పిల్లలను తీర్చిదిద్దుదాం.

వ్యవస్థలో మార్పు కోసం గళం ఎత్తుదాం!

"మా పిల్లలకు   సృజనాత్మకత విద్య, నిజాయితీతో కూడిన పరీక్షలు అందించండి..!"

ప్రభుత్వాన్ని, బోర్డుకు డిమాండ్ చేద్దాం...!!!

మారుదాం... మార్చుదాం! 💪

#SaveOurChildrenFuture #HonestEducation #NoMoreMalpractice #IntermediateReform #PAAP

ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP)

(రిజి. నెం. 6/2022)

ఫోన్: +91 63053 13558

ఈమెయిల్: parentsassociationap@gmail.com