మార్కెట్ ఆక్రమణల పై కమిషనర్ కొరడా....


 మార్కెట్ ఆక్రమణల పై కమిషనర్ కొరడా.....

:

మండపేట పురపాలక సంఘ పరిధిలో కె.పి. రోడ్డులో సర్దార్ వేగుళ్ళ వీర్రాజు మున్సిపల్ మార్కెట్ లో ఆక్రమణ లపై కమీషనర్ టీవీ రంగారావు కొరడా జూళిపించారు.

వ్యాపార దుకాణదారులు ప్రజలకు నడిచి వెళ్ళే మార్గం లేకుండా ఆక్రమించి దుకాణాల ముందు అడ్డంగా  వ్యాపారాలకు సంబంధించిన కూరగాయలను, కిరాణా సామగ్రిని దారి మార్గానికి  అడ్డంగా పెడుతున్నారు. ప్రజల తీవ్ర ఇబ్బందులను గమనించి కమీషనరు టి.వి. రంగారావు ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళిక విభాగం వార్డు ప్లానింగ్ సెక్రటరీల సిబ్బంది పూర్తిగా అక్కడ ఆక్రమించిన దుకాణాల వద్ద సామాగ్రిని పారిశుద్ధ్య సిబ్బందితో తీయించారు.  అక్కడ ఉన్న చెత్తను తొలగించారు. కమీషనర్  మాట్లాడుతూ ఇప్పటి నుండి  మార్కెట్, మెయిన్ రోడ్డులలో వ్యాపార దుకాణదారులు  షాప్ ముందు స్దలాలను ఆక్రమిస్తే  భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.