జర్నలిజం ముసుగేసుకుని రెచ్చిపోతున్న మతోన్మాద శక్తులు
ఈ అరాచక శక్తులకు కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్ వేదికలు
కొన్ని మతోన్మాద శక్తులు గత కొంతకాలంగా మీడియా ముసుగు ధరించి చేస్తున్న అరాచకం రాష్ట్ర ప్రజలను అశాంతికి గురిచేస్తుంది.ఇప్పుడు ప్రజల్లో మతోన్మాదం అనేది తీవ్రమైన భయాందోళనలకు గురిచేస్తోంది.మనిషిని మనిషిగా చూడలేని ఈ సమాజంలో మతోన్మాద శక్తుల అరాచకం ఎలావుంది అంటే, అవకాశం ఉన్న ప్రతిచోట మతవిద్వేషాలు రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నాయి కొన్ని యూ ట్యూబ్ చానల్స్. ఇటువంటి చానల్స్ నిర్వహిస్తున్న వ్యక్తులకు జర్నలిజం విలువలు, సామాజిక బాధ్యత, జర్నలిస్ట్ కి ఉండాల్సిన డిగ్నిటీ అనేవి ఏమీ పట్టని విధంగా వ్యవహరిసున్నారు.
మేడారం జాతరలో కోవాబన్ విక్రయించడానికి వెళ్ళిన శేక్షావలి అనే ముస్లిం సోదరుడిని టార్గెట్ చేసి,హింసించిన తేజస్విని అనే యూ ట్యూబ్ ఛానల్ ప్రతినిధుల అరాచకం ఏ మాత్రం క్షమించరానిది. ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే తీరున ఒక చిరువ్యాపారిని భయభ్రాంతులకు గురిచేసిన వైనం అడిగేవారు లేరనే ధైర్యమే కారణమా...?ఇది చాలా తప్పు,బ్రతుకుదెరువుకు వచ్చిన వ్యక్తి పేరును బట్టి వివాదం చేయాల్సిన అవసరం ఆ యూ ట్యూబ్ ఛానల్ కి ఏ ముంది.బన్ లో నాణ్యతా లోపం ఉంటే స్థానిక ఫుడ్ ఇన్స్పెక్టర్ కి ఫిర్యాదు చేయాలనే ఇంగితజ్ఞానం లేని వ్యక్తులు జర్నలిస్ట్ ఎలా అవుతారు...?ఇటువంటి శక్తులు ఈ విధానాలకు పాల్పడుతుంటే చూస్తూ గమ్మున ఉండేది మీడియా ఎందుకు అవుతుంది...?తప్పనిసరిగా వీరిని మతోన్మాద శక్తులుగానే పరిగణించాలి. వారిని అక్కడికి పంపి,శేక్షావలి వంటి చిరువ్యాపారిని టార్గెట్ చేసి, మతవిద్వేషాలు రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్న ఆ మీడియా ఛానల్ పై పోలీసు అధికారులు తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకోవాలి.
ఒక మనిషి కష్టపడి జీవిస్తున్న విధానంపై, తాను విక్రయిస్తున్న కోవాబన్ నాణ్యతపై వార్తలు వేసి చిరు వ్యాపారిని దోచుకోవాలనే ప్రయత్నం జర్నలిజంకి సిగ్గుచేటు.ఇలాంటి కొందరు లోఫర్ గాళ్ళు, లుచ్చాగాళ్ళు, తారుపుడు వెధవలు జర్నలిజాన్ని అడ్డంపెట్టుకుని ఇతర మతాలను దూషిస్తూ, దాడులుచేస్తున్న ఈ విధమైన ప్రయత్నాలు రాష్ట్ర ప్రజల ఐక్యతను దెబ్బతీయడమే కాకుండా, భారతదేశ లౌకికవాదానికి తూట్లు పొడుస్తున్నట్లే కదా.కొన్ని యు ట్యూబ్ ఛానళ్ల తీరు మరీ విడ్డూరం.అందులో వ్యాఖ్యాతలు,ఇంటర్వ్యూ నిర్వాహకులు ఏ మాత్రం జర్నలిజం విలువలు పాటించడంలేదు.ఒక మతానికి,మరొక మతానికి సంభందించిన అంశాలపై చర్చలు తారాస్థాయికి చేరుచున్నాయి.ఈ చర్చలు హద్దులు దాటిపోయి అదుపులేని వాదనలుగా మారుతున్నాయి.అసలు విషయం ఏమంటే,యూ ట్యూబ్ నిర్వాహకులు మరి ముఖ్యంగా గమనించాలి.కొంతమంది ఇంటర్వ్యూ పేరిట తాము అడగాల్సిన ప్రశ్నల స్థాయిని దాటిపోయి వీళ్ళే మతోన్మాదులుగా మారిపోయి, హాద్దులు మీరి ఇంటర్వ్యూ చేయవలసిన వ్యక్తులపై దూషణలు చేయడం, ఏకవచనంతో వ్యంగ్యంగా మాట్లాడటం,ఒకరిపై ఒకరు సవాల్ విసురుకోవడం ఇది జర్నలిజం అని చెప్పుకోవడం ప్రజల్ని వెర్రిపప్పలుగా చూడటం కొన్ని యు ట్యూబ్ చానల్స్ కి ప్రత్యేకమైన పనిగా మారింది.
ఇది అలా ఉంటే,యూ ట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ అనగానే సుదూర ప్రాంతాలకు సైతం వెళ్ళి అక్కడ ఆ ఛానల్స్ వారితో నోటినిండా లడ్డూలు పెట్టించుకుని వచ్చేవారు మనం చేస్తుంది తప్పు అని తెలుసుకోలేక ఉన్నారు అనుకోవడం ప్రజల తప్పు.ఇటువంటి కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్ కేవలం వ్యూస్ కోసం,వారేదో పెద్ద కొమ్ములు తిరిగిన జర్నలిస్టుల్లా,కేవలం మతోన్మాదంతో,మత విద్వేషాలు రెచ్చగొట్టే పనిలో ఉన్నారు.ఈ విధానం చల్లగా చాపకింద నీరులా కాదు-ముడ్డి క్రింద మండిపోయే మంటలా మారుతుంది.ప్రజలు కొన్ని యూ ట్యూబ్ చానల్స్ ప్రసారాలను ఆశక్తిగా వీక్షించడం కన్నా, చూడకపోవడమే మిన్న. ఇలా మతోన్మాదంతో పవిత్రమైన జర్నలిజంలోకి చొరబడి యూ ట్యూబ్ ఛానల్స్ వేదికగా,మత విద్వేషాలు రెచ్చగొడుతున్న ఆ హక్కు ఏదో తమకే ఉన్నట్లు వ్యవహరిస్తున్న కొందరు యూ ట్యూబ్ ఇంటర్వ్యూల నిర్వాహకులు ఏ మాత్రం జర్నలిస్టులు కాదు-వారు ముమ్మాటికీ మతోన్మాద అరాచక శక్తులే.ఈ శక్తులను కట్టడి చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది.లేని పక్షంలో దేవుళ్ళ పేరుతో జరిగే నామస్మరణలతోనే మూడవ ప్రపంచయుద్దం వచ్చే ప్రమాదం ఉన్నట్లు ఉంది పరిస్థితి.
