కొత్తపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార మహోత్సవం.




కొత్తపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు పాలకవర్గ ప్రమాణ స్వికారాలు మహోత్సవం నేడు రావులపాలెం MKR కన్వెన్షన్ హాల్ నందు జరిగింది. కొత్తపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పల్లి మంగాదేవి బీమారావుగారు, వైస్ చైర్మన్ గా కంఠంశెట్టి శ్రీనివాసరావు గారు తో జనసేన పార్టీ తరుపున ఎన్నికైన యర్రంశెట్టి సత్తిబాబు, కుడిపూడి సత్యనారాయణ, కోలా వెంకట ధనలక్ష్మి సుబ్బారావు గార్లతో పాటు కార్యవర్గ సభ్యులు తో కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యనందరావు గారు ప్రమాణస్వికరాలు చేపించారు.కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ముందుగా నూతనంగా ఏర్పడిన కార్యవర్గసభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసారు, ఈ వ్యవసాయ మార్కెట్ ను అభివృద్ధి పదంలో నడిపి రాష్ట్రంలో అగ్రగామి స్థానం లో నిలబెట్టేందుకు అందరు కృషి చెయ్యాలని నూతన పాలకవర్గానికి సూచించారు.

ఈ కార్యక్రమం లో MLC పేరాబత్తుల రాజశేఖరం గారు, టీడీపీ పోలిటిబ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం అనంతకుమారి గారు, రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గొల్లపల్లి అమూల్య గారు, ఆకుల రామకృష్ణ గారు, కె.వి సత్యనారాయణరెడ్డి గారు మరియు తదితరులు కూటమి నాయకులు పాల్గొన్నారు..