వాల్నట్ మహిళల్లో ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఆరోగ్యకరమైన మరియు ముడతలు లేని చర్మం
కోసం మహిళలు రోజూ కనీసం రెండు సార్లు గుప్పెడు వాల్నట్ తినాలి. వాల్నట్ తినడం వల్ల మహిళల ఆరోగ్యo బాగుపడుతుంది. 50 మరియు 60 ఏళ్లలోని మహిళలు తమ ఆహారంలో తప్పనిసరిగా వాల్నట్ చేర్చాలి. జర్నల్ ఆఫ్ ఏజింగ్ రీసెర్చ్ లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం "ఆరోగ్యకరమైన వృద్ధాప్యం" మంచి మానసిక ఆరోగ్యం మరియు 65 సంవత్సరాల వయస్సు తరువాత క్రానిక్ వ్యాధులు, అభిజ్ఞా సమస్యలు లేదా శారీరకబలహీనతలు లేకుండా ఉండటం గా దీర్ఘాయువుగా నిర్వచించబడింది. అనేక పరిశోధనల ప్రకారం వాల్నట్ తినడం వలన వృద్ధులలో శారీరక బలహీనతలు మరియు అభిజ్ఞా క్షీణత తగ్గుతుంది మరియు అది ఆరోగ్యం పై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. వాల్నుట్ తినడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు మరియు టైప్ 2 డయాబెటిస్‌లో తగ్గుదలని కనుగొన్నారు కొన్నిమంచి ఆరోగ్య అలవాట్లను అవలంబించడం, కొన్ని అక్రోట్లను/వాల్నట్ తినడం దీనికి సహాయపడతాయి.వాల్నట్ తినడం వలన తరువాతి జీవితంలో మెరుగైన ఆరోగ్యo ఉండే అవకాసం ఉందని పరిశోధకులు చెప్పారు.
