
మండపేట మండలం, ఏడిద గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్కూల్ టీచర్లు, సిబ్బందితో కలిసి వంటగది, టాయిలెట్స్, పాఠశాల పరిసరాల పరిశుభ్రతను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన రికార్డుల నిర్వహణను నిశితంగా పరిశీలించారు. ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా రుచి చూశారు. రోజూ భోజనం బాగుంటుందా కడుపునిండా మెనూ ప్రకారం అన్నం పెడుతున్నారా అని విద్యార్థులను ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రతీరోజూ భోజనం బాగానే ఉంటుందని విద్యార్థులు సమాధానం ఇచ్చారు. పాఠశాలల్లో విద్యార్థులకు రుచికరమైన, శుచికరమైన ఆహారం అందించడంలో ఎలాంటి అలసత్వం వహించవద్దని అధికారులకు ఎమ్మెల్యే వేగుళ్ళ ఆదేశాలు జారీ చేశారు. టాయిలెట్స్ నిర్వహణను మరింత మెరుగుపరచాలన్నారు. పాఠశాల ఆవరణతో పాటు మొత్తం ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు పర్వతిన వీర్రాజు, సర్పంచ్ బూరిగ ఆశీర్వాధం, మేకా జేజిబాబు, సొసైటి అధ్యక్షులు గొడవర్తి సత్యనారాయణ (ఎర్రబ్బు), చిట్టూరి ప్రసాద్, పదం ఆనంద్, కుర్మాన శ్యాంబాబు, పలివెల దానియేలు, పాడిశెట్టి శ్రీనివాస్, రామిశెట్టి రాజు, వాసంశెట్టి వెంకటరమణ, చల్లా మణికంఠ, గొడవర్తి వీర్రాజు, లంక రాణా, అందుకూరి పుల్లాజి, బలుసు శ్రీనివాసు, గుడాల రామనాదం, కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.