అర్హులందరికీ పింఛన్లు….. ఎమ్మెల్యే వేగుళ్ళ......


రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతీ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యమని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు

తెలిపారు. బుధవారం మండపేట పట్టణంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని 10వ వార్డుకు చెందిన ఉయ్యూరి వరలక్ష్మి, 14వ వార్డుకు చెందిన బొడ్డు పుష్పావతి లకు మంజూరైన స్పౌస్ పింఛన్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందన్నారు. ప్రజలకిచ్చిన హామీలను రాజీ పడకుండా సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శిరంగు ఈశ్వరరావు, శెట్టి రవి, పిట్టా రాజబాబు, సాధనాల చక్రపాణి, బడుగు రత్నంరాజు,  చుండ్రు సోమరాజు, కొప్పిరెడ్డి రాజు, మున్సిపల్ కమిషనర్ టి.వి.రంగారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.