తూర్పు గోదావరి జిల్లా ఏపీ యూ డబ్ల్యూ జె జిల్లా మహాసభలు రాజమహేంద్రవం గైట్ కళాశాల లో నిర్వహించారు. గత ఏడాది మే లో రామచంద్రాపురం లో నిర్వహించిన డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఏపీ యూ డబ్ల్యూ జె యూనియన్ సభలో మండపేట కు చెందిన నలుగురు జర్నలిస్ట్ లు ఆ జిల్లా కార్యవర్గవం లో ఎన్నికయ్యారు. కాగా డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుండి తూర్పు గోదావరి జిల్లా లో ఈ నియోజకవర్గం విలీనం కావడంతో ఈ జిల్లా కార్యవర్గం లో వీరు ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షులు గా ఏం శ్రీరామూర్తి ఎన్నికయ్యారు. జిల్లా ఉపాధ్యక్షులు గా కోసూరి అప్పారావు, జాయింట్ కార్యదర్శి గా ఉండమట్ల ప్రసాద్, జిల్లా కార్యవర్గం సభ్యులు గా చిల్లే
లక్ష్మీ నారాయణ, డి పాపారావు లు ఎన్నికయ్యారు. వీరిని మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కామన ప్రభాకరరావు,మాజీ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి, బిజెపి నాయకులు కోటిపల్లి సాయి రామ్,కోన సత్యనారాయణ, యువ నాయకులు వేగుళ్ళ అజయ్ బాబు, వి సాయి కుమార్ బాబు తదితరులు అభినందించారు. ఈ కార్యక్రమం లో ఐ జె యు మాజీ సభ్యులు సయ్యద్ హుస్సేన్, డివిజన్ అధ్యక్షులు టపా రామకృష్ణ, నాయకులు జి గోపి, యార్లగడ్డ ప్రసాద్,మేకా వినోద్, కోటి రాజ్ కుమార్, మట్టా ధనరాజు,పలివెల వీర్రాజు, దేవానంద్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.
